Ap Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త..ఈ వారం అంతా వానలే వానలు..!
ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. బైక్ పై తిరుమల వెపు దూసుకెళ్లాడు అమీర్ అంజాద్ ఖాన్ అనే అన్యమతస్థుడు .ఈ క్రమంలో పలు వాహనాలను ఢీకొట్టాడు అతన్ని జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు
సంతానం కోసం ఓ తాంత్రికుడు నరబలి ఇచ్చిన దారుణ ఘటన బిహార్లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సంతానం కోసం నరబలి ఇచ్చినట్లు గుర్తించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి.ప్రకాశం జిల్లా ,కడప,నంద్యాల,తిరుపతి, శ్రీకాకుళం వరకు మొత్తం 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
సామాన్య భక్తులకు వేసవిలో ఇబ్బంది ఉండకూడదని టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్రేక్ దర్శనాలను కుదించేందుకు ప్లాన్ చేస్తోంది. బ్రేక్ దర్శనం సమయాన్ని తగ్గించడం లేదా రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇదే జరిగితే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదు.
తిరుమల దేవస్థానం గోపురం పైనుంచి గురువారం విమానం ప్రయాణించింది. ఆగమన శాస్త్ర నిబంధన ప్రకారం గుడిపై నుంచి విమాన రాకపోకలు నిషేదం. దీంతో టీటీడీ వేద పండితులు, భక్తులు విమానయాన శాఖపై మండిపడుతున్నారు. గతంలోనే ఇలా మరోసారి జరగొద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు కూడా ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతి కల్పించాలని నిర్ణయించారు. మొత్తం రూ.772 కోట్లతో 6,282 గదులకు మరమ్మతులు చేపట్టినట్లు పాలకమండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.
తిరుమల క్యూ లైన్ లో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో కూర్చునే విషయంలో గొడవ జరిగింది. మాటల యుద్ధం కాస్తా కొట్టుకోవడం వరకు వెళ్లింది.
చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా 30 సంవత్సరాల నుంచి వరుసగా పాములు కరుస్తున్నాయి. దీంతో ఆయన పది సంవత్సరాల క్రితం ఆయన సొంతూరు విడిచి బెంగళూరుకు వలస వెళ్లాడు. అక్కడ కూడా పాము కాటేయడంతో అక్కడి నుంచి తిరిగి మళ్లీ సొంతూరుకు వచ్చాడు.