/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/apsrtc-jpg.webp)
APSRTC
ఇంటర్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఈసారి గతానికి భిన్నంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తైన తర్వాత.. సెలవులు ప్రకటించేవారు. అయితే ఈసారి మాత్రం ఏప్రిల్‌లోనే ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించారు.
2025-26 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి అనుగుణంగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు.
Also Read: Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు!
అయితే ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి చదువుకునే విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఈ బస్‌పాస్‌లు ఎంతోగానో ఉపయోగపడతాయి. ప్రయాణించే దూరాన్ని బట్టి నెలవారీగా కొంత మొత్తం తీసుకుంటూ విద్యార్థులకు ఆర్టీసీ బస్‍పాస్‌లు అందిస్తూ ఉంటుంది.
సాధారణంగా ఏటా జూన్ నుంచి మార్చి వరకు ఇంటర్ విద్యార్థులకు తరగతులు జరిగేవి. దీనికి అనుగుణంగానే ఆర్టీసీ యాజమాన్యం బస్ పాస్‌లు జారీ చేసేది. ఈ ఏడాది తరగతులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించారు. అయితే ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారులు ఆర్టీసీకి సమాచారం ఇవ్వలేదు. దీంతో విద్యార్థులకు ఆర్టీసీ సిబ్బంది బస్‌పాస్‌లు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ప్రయాణ ఖర్చులు భరిస్తూనే తరగతులకు హాజరవ్వాల్సి వచ్చింది.
అయితే ఈ విషయమై మీడియాలో వార్తలు రావటంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పందించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏప్రిల్ నెల కూడా రాయితీ బస్‌పాస్‌లు రెన్యువల్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, డిపోల అధికారులకు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో విద్యార్థులకు భారం తప్పనుంది.
Also Read: USA: అమెరికాకు ఎగుమతులను ఆపేస్తున్న బడా కంపెనీల కార్లు..జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రేక్
Also Read: Rain Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు!
apsrtc | apsrtc-buses | Ap Inter classes | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates