BIG BREAKING: తిరుమలలో అగ్ని ప్రమాదం!
తిరుమలలో కారు దగ్ధమైంది.షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్నికి ఆహుతి అయ్యింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ వద్ద ఏసీ ఆన్ చేయడం వల్ల కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కారు కాలిపోయింది.
తిరుమలలో కారు దగ్ధమైంది.షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్నికి ఆహుతి అయ్యింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ వద్ద ఏసీ ఆన్ చేయడం వల్ల కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కారు కాలిపోయింది.
14 ఏళ్లు ముఖ్యమంత్రి.. 15 ఏళ్లు ప్రతిపక్ష నేత.. 28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్ల వయసులోనే మంత్రి 45 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం..ఇదీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రికార్డ్ లు. 75 ఏళ్ళ వయనులోనూ అలుపెరగని ఉత్సాహంతో పని చేస్తున్న బాబు పుట్టిన రోజు ఈరోజు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. ఐదేళ్లలో తిరుమలలో అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు.
కారులో ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తిరుమల ట్రాఫిక్ పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. చిన్నారుల ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన కలియుగప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలలో చోటుచేసుకుంది.
తిరుమల గోషాలలో వందకి పైగా ఆవుల మృతి చెందాయని భూమన అరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. భూమన అసత్య ప్రచారం చేస్తున్నాడని భాను ప్రకాష్ వెల్లడించాడు.
టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పర సవాళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దీంతో భూమన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పవన్ భార్య అన్నా లెజినోవాపై జరుగుతున్న ట్రోలింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఘాటుగా స్పందించారు. పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ ఆమె హిందూ ధర్మాన్ని నమ్మారని చెప్పారు. అలాంటి మహిళను ట్రోల్ చేస్తే తాటా తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతిలో తలనీలాలు సమర్పించడం చర్చనీయాంశమైంది. మహిళలు తలనీలాలు సమర్పించవద్దని గరికపాటి గతంలో అన్న వీడియోను కొందరు షేర్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా పవన్ ఫ్యాన్స్ మరో ప్రవచనకర్త వీడియోను వైరల్ చేస్తున్నారు.