ప్రతీ రాజధానిలో ఆలయాలు.. టీటీడీ కీలక నిర్ణయం

ఇటీవల టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఇందులో తిరుమల అభివృద్ధి కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే దేశంలో ప్రతీ రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని టీటీటీ ఈవో శ్యామల రావు తెలిపారు.

New Update
TTD EO Shyamala Rao: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం

ఇటీవల టీటీడీ పాలకమండలి మీడియా సమావేశం జరిగ్గా.. అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోపు దర్శనం అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు కంపెనీలు డెమో ఇస్తున్నాయని, వీటిపై ట్రయిల్ రన్ నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని టీటీడీ పాలక మండలి ఛైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు తీసుకెళ్లాలని సీఎం సూచనలు చేశారని టీటీడీ ఈవో శ్యామల రావు అన్నారు. దీనిపై ఓ కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు.

ఇది కూడా చూడండి: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! 

నాణ్యమైన ఆహారాన్ని అందించేలా..

నడక మార్గంలో ఆరోగ్య సమస్యల కారణంగా మరణాలు సంభవించకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలకు ప్రణాళిక వేయనున్నట్లు తెలిపారు. అలాగే భక్తులకు అందించే సేవలపై ఫీడ్ బ్యాక్ సిస్టం కూడా ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలోని హోటల్స్ నాణ్యమైన ఆహారాన్ని అందించేలా నూతన పాలసీ రూపొందిస్తామన్నారు. తిరుమలలో జాతీయ బ్రాండెడ్ రెస్టారెంట్లను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!

తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించేలా రెస్టారెంట్‌లో ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే అన్నప్రసాదం విభాగంలో పోస్టులకు భర్తీకి, అదనపు పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో తెలిపారు. కంచి కామకోటి విద్యాసంస్థకు రూ. 2 కోట్లు మంజూరు చేశామన్నారు. దేశంలో ప్రతీ రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. భక్తులకు అందించే సేవలపై ఫిడ్ బ్యాక్‌ని ఏపి డిజిటల్ సహకారంతో స్వీకరించేందుకు నిర్ణయించారు.

ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్

ముంబైలో స్వామి వారి ఆలయం 10 ఎకరాల్లో, నవి ముంబైలో 3.5 ఎకరాల్లో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించడానికి విన్నతి వచ్చినట్లు తెలిపారు. అలాగే క్యూలైన్‌లో టాయిలెట్స్ కట్టాల్సిన అవసరం ఉందని రూ.3 కోట్లతో కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇతర మఠాలపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!

పవన్ భార్య అన్నా లెజినోవాపై జరుగుతున్న ట్రోలింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఘాటుగా స్పందించారు. పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ ఆమె హిందూ ధర్మాన్ని నమ్మారని చెప్పారు. అలాంటి మహిళను ట్రోల్ చేస్తే తాటా తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. 

New Update

Vijayashanthi: పవన్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్‌పై- కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి - ఘాటుగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ-- అన్నా.. హిందూ ధర్మాన్ని నమ్మారని పొగిడేశారు.- అగ్నిప్రమాదం నుంచి కొడుకు బయటపడినందుకు..-- కృతజ్ఞతగా శ్రీవారికి తల నీలాలు ఇచ్చారు.  అలాంటి మహిళను ట్రోల్ చేయడం తప్పు- అని మండిపడ్డారు. పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటా తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

అత్యంత అసమంజసం..

'దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు.  సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. 
హరహర మహాదేవ్. జై తెలంగాణ' అంటూ తన అభిప్రాయం వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

మార్క్‌ శంకర్‌పై కూడా ..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల వీరు హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ క్రమంలో కొందరు దుండగులు సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు భార్య అన్నా లెజినోవా.. కుమారుడు మార్క్‌ శంకర్‌పై కూడా సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. అయితే వీరిని గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు. అయితే వీళ్లు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment