Bird Flu : తెలంగాణలో చికెన్ తినేవారికి అలెర్ట్.. అధికారుల కీలక ఆదేశాలు!

పక్క రాష్ట్రల్లో బర్డ్ ప్లూ వైరస్ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లోని అధికారులు అలర్ట్ అయ్యారు.  కోళ్లను రక్షించడానికి చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తిపై ప్రజలలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్లను కోరారు.

author-image
By Krishna
New Update
bird flu medak

bird flu telangana

పక్క రాష్ట్రల్లో బర్డ్ ప్లూ వైరస్ (Bird Flu Virus) కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.  ముఖ్యంగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లోని పశుసంవర్ధక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.  కోళ్లను రక్షించడానికి చర్యలను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల ఫారాల యాజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వెంటర్నీ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు సహకరించాలని, ప్రతి సమాచారం అందించాలని కోళ్ల ఫారాల యాజమానులకు  సూచించారు. అంతేకాకుండా  బర్డ్ ప్లూ వైరస్  నేపథ్యంలో చికెన్, గుడ్లు తినే విషయంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బర్డ్ ప్లూ వ్యాప్తిపై ప్రజలలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్లను కోరారు.  

Also Read :  Vande Bharat Train లో సిగరేట్ అంటించిన ప్యాసింజర్.. బోగీ అంతా పొగ-VIRAL VIDEO

మరోవైపు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి కోళ్ల ఫారాల యాజమానులు తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.  ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో కోళ్లు చనిపోతే వాటిని పాతిపెట్టి.. బయో కెమికల్‌ పౌడర్‌ (Bio Chemical Powder) చల్లాలన్నారు. మిగితా కోళ్లకు, పక్కన ఉన్న కోళ్ల ఫారాలకు వ్యాధి సోకకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక బర్డ్ ప్లూ వైరస్  వలన భయపడాల్సిన పనిలేదని..  చికెన్ , గుడ్లు తీసుకున్నా అరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు అంటున్నారు.  అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకలేదని స్పష్టం చేస్తున్నారు. కోడి మాసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని వెల్లడించారు.  

Also Read :  భారత రెస్టారెంట్లను టార్గెట్ చేసిన బ్రిటీష్ ప్రభుత్వం

Also Read :  ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్‌ కట్‌.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?

బర్డ్ ఫ్లూ కలకలం

ఇక తూర్పు గోదావరి జిల్లా (East Godawari District) లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బ్లర్డ్‌ ఫ్లూతో చనిపోతున్న కోళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో అధికారులు కొన్ని శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేశారు. వీటిలో శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాజమండ్రి కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంలో 9542908025 నెంబర్ ఏర్పాటు చేశారు. 

Also read :  శామ్‌సంగ్ నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. ధర రూ.9 వేలే.. ఓ లుక్కేయండి!

Advertisment
Advertisment
Advertisment