/rtv/media/media_files/2025/01/23/zwTRDIZrPaCRNOgbbFDq.jpg)
Lokesh birthday occasions Clashes in Tamballapally
ఏపీ మంత్రి లోకేష్ బర్త్ డే (Nara Lokesh Birthday) సందర్భంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బి.కొత్తకోట, తంబళ్లపల్లిలో లోకేష్ బ్యానర్లను గుర్తుతెలియని దుండగులు చించివేశారు. తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించినప్పటి నుంచి ఇక్కడ గొడవలు తారా స్థాయికి చేరుకోగా గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి.
శంకర్ వర్సెస్ జై చంద్రారెడ్డి..
మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్సెస్ దాసరిపల్లి జై చంద్రారెడ్డి వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తోంది. మొదటినుంచి తంబళ్లపల్లి తెలుగుదేశం క్యాడర్ ను కలుపుకొని పోకుండా జయచంద్రరెడ్డి ఒంటెద్దు పోకడగా వెళుతున్నాడంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేయడం ఉత్కంఠగా మారింది.
Wishing you a Very Happy Birthday dear @naralokesh ! Your relentless hard work and passion to serve Telugu people and achieve greater growth for AP are heartening. May you succeed in all your endeavours !! Have a wonderful year ahead! 💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 23, 2025
ఇది కూడా చదవండి: Rashmika Mandanna: ఇదే నా లాస్ట్ సినిమా.. రిటైర్మెంట్ పై రష్మిక సంచలన ప్రకటన
ఇందులో భాగంగానే గురువారం ఉదయం నుంచి మొలకల చెరువులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శంకర్ తెప్పించిన కేకును జై చంద్రారెడ్డి అనుచర వర్గం ఆటోలో నుంచి కిందకు పడేసి తొక్కేశారు. ఈ ఘటనలో సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ రెడ్డి, జై చంద్రరెడ్డి డ్రైవర్ శివ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి బ్యానర్లను చించివేశారు. దీంతో తంబళ్లపల్లి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుతుండగా టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.