AP-Mumbai: ఏపీ యువతిని ముంబైలో రేప్ చేసి చంపిన యువకుడు.. నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీంకోర్టు!

ముంబైలో రేప్ అండ్ మర్డర్‌కు గురైన ఏపీ యువతి 2014కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన నిందితుడు చంద్రభాన్‌ సుదామ్‌ సనప్‌ను నిర్ధోషిగా విడుదల చేసింది. సాక్ష్యాలు సరిగాలేనందున కేసు కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

New Update
ap-mubai

ap-mubai Photograph: (ap-mubai)

AP- Mumbai rape-murder case: ఏపీలోని మచిలీపట్నంకు చెందిన యువతి అత్యాచారం, హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన చంద్రభాన్‌ సుదామ్‌ సనప్‌ అనే వ్యక్తి ఆమెను ముంబైలో చంపేయగా అతనికి పదేళ్ల క్రితం (2015) ఉరిశిక్ష పడింది. అయితే ఈ కేసును తాజాగా పరిశీలించిన సుప్రీం కోర్టు చంద్రభాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. బాధితురాలి తరఫున ప్రాసిక్యూషన్‌ సరై సాక్ష్యాలు చూపించలేకపోవడతో చంద్రభాన్ దోషి కాదని చెబుతూ.. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం 113 పేజీల తీర్పు చెప్పింది.

2015లో చంద్రభాన్‌కు మరణశిక్ష..

ఈ కేసులో ముంబై ట్రయల్‌ కోర్టు 2015లో చంద్రభాన్‌కు మరణశిక్ష విధించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును చంద్రభాన్ సుప్రీం కోర్టులో సవాలు చేశాడు. దీంతో విచారణ జరిపిన ధర్మాసనం సాక్ష్యాధారాలు సంతృప్తికరంగా లేవని తేల్చిచెప్పింది. చంద్రభాన్ లాయర్ ప్రశ్నలకు ప్రాసిక్యూషన్ సమాధానం చెప్పలేకపోవడంతో ప్రాసిక్యూషన్ చెప్పిన అంశాలను తోసిపుచ్చింది. సాక్ష్యాధారాలు సరిగా లేనందున చంద్రభాన్‌పై నేరారోపణలు నిలబడటం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే.. 

ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం యువతి హస్టల్ లో ఉంటూ ముంబైలోని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేది. అయితే సెలవుపు ఇంటికొచ్చిన ఆమె.. తిరుగుప్రయాణంలో 2014 జనవరి 4న విజయవాడలో లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో జవవరి 5న ముంబై చేరుకుంది. తెల్లవారుజామున 5 గంటలకు స్టేషన్‌ బయట ఉన్న చంద్రభాన్‌.. ఆమెను అంధేరిలోని హాస్టల్‌ దగ్గర బైకుపై దింపుతానని, అందుకు రూ.300 ఇవ్వాలని అడగగా ఆమె ఒప్పుకుంది. ఈ క్రమంలోనే మార్గ మధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. డెడ్ బాడీని కాల్చి హైవే పక్కన పొదల్లో వదిలేశాడు. 

ఇది కూడా చదవండి: Constable Suicide: షేర్ మార్కెట్లో కోటి పోగుట్టుకుని కానిస్టేబుల్ సూసైడ్.. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే?

ఎలా దొరికాడంటే..

ఇక యువతి తండ్రి ఆమెకు చేరుకుందో లేదో అని తెలుసుకునేందుకు పదే పదే ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదు. దీంతో కంగారుపడిపోయి వెంటనే విజయవాడ రైల్వే పోలీసులకు విషయం చెప్పాడు. ఆమె కోసం సెర్చింగ్ మొదలుపెట్టిన పోలీసులు  ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద ఆమె డెడ్ బాడి పడివున్నట్లు గుర్తించారు. తల, ప్రైవేట్ పార్ట్ పై గాయాలను గుర్తించి అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. దీంతో కేసున సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడు చంద్రభాన్‌ 2014 మార్చి 2న అరెస్టు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు అతన్ని నిర్ధోషిగా విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

కన్నీరుమున్నీరవుతున్న తండ్రి..

ఈ కేసులో దోషిగా ఉన్న సనప్‌ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తమకు తెలియదని.. కోర్టు నిర్దోషిగా తేల్చిన తర్వాత  ఇప్పుడు తాము ఏం చేయాలని మృతురాలు తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడు తన వయసు ఇప్పుడు 70 ఏళ్లు అని.. తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని వాపోతున్నాడు. ఈ ఘటన జరిగి ఇప్పటికే 11 ఏళ్లు గడిచిపోయాయని తెలిపాడు. తమ కూతురు చనిపోయినందుకు ఎంతో కొంత న్యాయం జరిగిందని ఇంతకాలం అనుకున్నామని.. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అంతా మారిపోయిందని వాపోయాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment