Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు!

శ్రీకాకుళం జిల్లాలోని మందసలో చారిత్రకమైన శ్రీవాసుదేవ పెరుమాళ్ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. చివరి రోజు రథయాత్ర ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో డీజే పాటలకు పూజారులు, అర్చకులు బ్రేక్ డ్యాన్సులు వేశారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి.

New Update
srikakulam priest break dance in brahmotsavam

srikakulam priest break dance in brahmotsavam

సాధారణంగా భగవంతుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఎంతో నిష్టతో కలిగి ఉంటాయి. భక్తి, శ్రద్ధలతో ఆ భగవంతున్ని పూజిస్తారు. అర్చకులు, భక్తులు భక్తి పారవస్యంలో మునిగితేలుతుంటారు. ముఖ్యంగా భగవంతుని ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భక్తి, భజన పాటలతో సందడి సందడి చేస్తారు. 

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భక్తి పాటలకు (Devotional Songs) బదులుగా మాస్, డీజే పాటలు (DJ Songs) పెట్టి డ్యాన్సులు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువైపోయాయి. భగవంతుని ఉత్సవాల్లో మాస్ మాటలకు ఎంతో మంది డ్యాన్సులు చేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే?.. ఇలాంటి ఉత్సవాల్లో భక్తులు డ్యాన్సులు వేయడం సాధారణమైన విషయమే కానీ.. అర్చకులు సైతం మాస్ పాటలకు డ్యాన్సులు వేయడం ఆసక్తికరంగా మారింది. 

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

ఓ బ్రహ్మోత్సవ రథయాత్రలో డీజే పాటలు పెట్టగా.. దానికి అర్చకులంతా కలిసి డ్యాన్సులు వేయడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

Also Read :  బీసీసీఐ నిర్ణయాలపై ధావన్ సంచలన వ్యాఖ్యలు.. అది తప్పనిసరి అంటూ!

అర్చకులు బ్రేక్ డ్యాన్సులు

తాజాగా శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లోని మందసలో చారిత్రకమైన శ్రీవాసుదేవ పెరుమాళ్ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజు రథయాత్ర ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తి, భజన పాటలకు బదులుగా.. డీజే పాటలు పెట్టారు. అక్కడ వరకు బాగానే ఉన్నా.. ఆ పాటలకు పూజారులు, అర్చకులు బ్రేక్ డ్యాన్సులు వేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ ఆలయంలో ఉండే పూజారులు బ్రేక్ డ్యాన్సులతో రోడ్లపై సందడి చేశారు. ఏకంగా సినిమా హీరో రేంజ్‌లో స్టెప్పులు వేసి ఔరా అనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment