/rtv/media/media_files/2025/01/13/uzi2dbfm6Hmp5WMvmwLI.jpg)
sankranthi special 500 hundred types of food feast ap
Sankranthi: సంక్రాంతి సందర్భంగా ఏపీ యానాంలో కొత్త అల్లుడికి అత్తగారు అదిరిపోయే విందు ఇచ్చారు. 500 రకాల ఐటమ్స్ ఏర్పాటు చేసి సత్యభాస్కర్-వెంకటేశ్వరి దంపతులు ఔరా అనిపించారు. ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందంటూ సాకేత్ సంతోషం వ్యక్తం చేశాడు.
500 వందల రకాలు..
మర్యాదలతో చుట్టాలని కట్టిపడేయటం గోదావరి జిల్లా వాసుల ప్రత్యేకత. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల రెండవ కుమార్తె హరిణ్య కు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్ వివాహం అయింది. కొత్తగా పెళ్లయి వచ్చిన చిన్నల్లుడిని సంక్రాంతి పండగకు ఆహ్వానించి 500 రకాలతో ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు క్లోజ్ ఫ్రెండ్ బిగ్ షాక్.. రేవంత్ పై పొగడ్తల వర్షం.. అసలేం జరుగుతోంది?
వివిధ రకాల శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు ఇలా 500 వందల రకాలు కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు సాకేత్ కుమార్తె హరిణ్యకు ఇద్దరికి విందు ఏర్పాటు చేశారు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన విందుకు అల్లుడు సాకేత్ ఉబ్బితబిబ్బయ్యాడు. శాఖాహారంలో ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందని అల్లుడు సాకేత్ తెలిపారు.
అలాగే సత్యభాస్కర్ నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. హరిదాసు కీర్తనలు, 200 అడుగులు భోగిపిడకల దండతో భోగి మంటలు వేశారు. మాజేటి ఉమ్మడి కుటుంబంలో వివాహం కావడంతో కొత్త అల్లుడు సాకేత్, హరిణ్యకి గుర్తుండిపోయే విధంగా సంక్రాంతి విందు భోజనాన్ని ఏర్పాటు.
ఇది కూడా చదవండి: Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్!