/rtv/media/media_files/2025/02/27/jxkC3hlPV3y5CbSRkA7y.jpg)
Posani krishna murali
ఏపీలో వైసీపీ నేత , సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) కి కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను దూషించిన వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా.. వీటిపై కోర్టుల్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈసారి సీఐడీ ఆయనపై నమోదు చేసిన ఫొటోల మార్ఫింగ్ కేసులో మాత్రం కస్టడీ తప్పడం లేదు. గుంటూరు కోర్టు ఆదేశాలతో సీఐడీ ఇవాళ పోసానిని కస్టడీలోకి తీసుకుంది. ప్రభుత్వ హాస్పటల్ లో వైద్య పరీక్షల అనంతరం పోసానిని సీఐడీ విచారించనుంది. కాగా కోర్టు పోసాని కృష్ణమురళిని ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది.
ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది
Posani Was Taken Into CID Custody
సీఐడీ అధికారులు (CID Officials) ఈ రోజు ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకూ విచారించనున్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు తయారు చేసి ప్రెస్ మీట్లోకి తెచ్చి మరీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తాజాగా సీఐడీ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసింది. ఇప్పుడు పోసానికి ఇవాళ ఒక్క రోజు పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీఐడీ ఇవాళ ఆయన్ను రిమాండ్ నుంచి అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్ పై గుంటూరు కోర్టుకు తెచ్చి హాజరుపర్చి రిమాండ్ తీసుకుంది.
ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!
Also Read : పట్టుదలకు చిరునామా, యువతకు స్ఫూర్తి సునీతా విలియమ్స్
మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను కించపరిచేలా అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సీఐడి కేసు నమోదు చేసింది. కాగా పోసాని ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ లో ఉన్నారు. కాగా వ్యక్తి గత దూషణలకు కారణాలపై విచారించే అవకాశం ఉంది. ఇవాళ సీఐడీ కస్డడీలో పోసాని కృష్ణమురళికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోల్ని ఎవరు మార్ఫింగ్ చేసి ఇచ్చారు, లేదా ఆయనే మార్ఫింగ్ చేశారా, చేస్తే ఎవరి ప్రోద్భలంతో ఇలా చేసారన్న దానిపై విచారించబోతున్నారు. ఇందులో పోసాని చెప్పే విషయాల ఆధారంగా ఈ కేసులో సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. గతంలో వైసీపీ నేత సజ్జల ప్రమేయంపై ఓసారి వాంగ్మూలం ఇచ్చిన పోసాని.. ఈసారి ఎవరి పేర్లు బయటపెట్టబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!