Posani: పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్.. ఈరోజు విడుదల!

నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఆయనకు మంగళవారం కర్నూలు జే‌ఎఫ్‌ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు పలు కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.

New Update
Posani Krishna Murali

Posani Krishna Murali

నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఆయనపై నమోదైన కేసుల్లో వరుసగా బెయిల్ మంజూరు కావడంతో బుధవారం జైలు నుంచి విడుదలవుతారనే ప్రచారం నడుస్తోంది. కర్నూలు మొదటి అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్, ఆదోని న్యాయస్థానం ఇంఛార్జ్ న్యాయాధికారి మంగళవారం బెయిల్‌ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఐదు రోజులుగా బెయిల్‌ పిటిషన్‌పై క్లారిటీ వచ్చింది. రూ.20 వేల పూచీకత్తు, ఇద్దరు జామీనుదారుల హామీతో బెయిల్‌ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీంతో పోసాని విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.

Also Read: Actress Ranya Rao:గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో కోర్టు విచారణ జరిపి.. గత వారం ఆయనకు ఈనెల 20 వరకు రిమాండు విధించారు. అప్పుడు కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చి.. అక్కడి కోర్టులో హాజరుపరిచారు. మళ్లీ ఆ తర్వాత కర్నూలు జైలుకు తరలించారు. విజయవాడ కోర్టులో పోసాని తరఫున లాయర్ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు మంగళవారం బెయిల్‌ ఇచ్చింది.

Also Read:  Trudeau:కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్‌!

మరికొన్ని కేసుల్లో హైకోర్టు నుంచి బెయిల్ మంజూరైంది. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు ఉండటంతో ఆయన విడుదలయ్యేలోపు ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్‌ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చన్న ప్రచారం కూడా నడుస్తోంది. లేకపోతే నేడు  విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. పోసాని ఈనెల 4 నుంచి కర్నూలు జైలులో ఉన్నారు.

గతప్రభుత్వం హయాంలో పోసాని కృష్ణమురళి ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఛైర్మన్‌గా పదవిలో ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

పోసానిని గత నెల 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలో అరెస్ట్ చేసి అక్కడికి తరలించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో.. ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయితే.. మరో కేసులో ఆయన అరెస్ట్ అవుతున్నారు. మరి ఆయన ఇవాళ విడుదలవుతారా?.. ఇంకేదైనా కేసులో అరెస్ట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై పలు జిల్లాల్లో ఏకంగా 17 వరకు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Also Read:  Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే!

Also Read: Ukraine: కాల్పుల విరమణకు అంగీకరించిన ఉక్రెయిన్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment