/rtv/media/media_files/2025/02/27/lMGEngU3Qi7Sp6pba5I0.jpg)
posani arrest jagan Photograph: (posani arrest jagan)
Posani Arrest: ప్రముఖ సినీ నటుడు, వైసీపీ పార్టీ(YCP Party) నాయకుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని బుధవారం ఏపీ పోలీసులు(AP Police) హైదారాబాద్(Hyderabad)లో అరెస్ట్ చేశారు. పోసాని అరెస్ట్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) స్పందించారు. పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఖండించారు. ఆయన భార్య కుసుమలతకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. అధైర్యపడొద్దని ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు జగన్. పోసాని న్యాయపోరాటంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Also Read: SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
పోసాని కుటుంబానికి జగన్ మద్దతు!
— Pavan Reddy (@Pa1_Redde) February 27, 2025
పోసాని కృష్ణమురళి సతీమణి కుసుమలతను ఫోన్లో పరామర్శించిన మాజీ సీఎం జగన్.
🔹 పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపిస్తున్నాం.
🔹 నాయకులందరినీ కోర్టుకు పంపించాం.
🔹 మేమందరం మీకు తోడుగా ఉంటాం... ధైర్యంగా ఉండండి!– @ysjagan
పోసానిపై కక్ష సాధింపు… pic.twitter.com/f5ECvkZP77
Also Read: Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? - Rtvlive.com
Also Read: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే
గత ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణ మురళి జనసేనా, టీడీపీ నాయకులపై నోరు పారేసుకున్నారని, బూతు పదజాలంతో తిట్టారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు. పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్‌కు ఆయన్ని తరలించారు. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు.
Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా