/rtv/media/media_files/2025/03/31/3n2MZU1rPX71JXUqcWjX.jpg)
kakani
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్,రవాణా,నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడం పై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి ,నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు.సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని అందులో పేర్కొన్నారు.
Also Read: Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్ హెచ్చరికలు!
నోటీసు ఇచ్చేందుకు ఆదివారం సాయంత్రం పొదలకూరు ఎస్సై హనీఫ్ నెల్లూరులోని మాజీ మంత్రి ఇంటికి వెళ్లగా. ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు.మాజీ మంత్రి ఇంటిలో లేకపోవడంతో ఆయన పారిపోయారనే ప్రచారం జరిగింది. కాసేపటికే హైదరాబాద్ లోని తన నివాసంలో కాకాణి ఉగాది వేడుకలు చేసుకుంటున్న ఫొటోలను ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
Also Read: Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్ చీఫ్!
కొందరు పోలీసులిచ్చిన ముందస్తు సమాచారంతోనే ఆయన అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం. చెన్నైలో నివాసముండే విద్యా కిరణ్ కు...పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని 32 ఎకరాల్లో రుస్తుం మైన్ పేరిట మైకా తవ్వకాలకు అనుమతి ఉంది. దానికి లీజు గడువు ముగియడంతో పునరుద్దరణకు దరఖాస్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెల్లరాయి గనులపై ఆ పార్టీ నేతలు కన్నేశారు.
లీజుదారుడు అంగీకరించకపోయినా..ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యంగా తెల్లరాయిని తరలించారు.అప్పట్లో మంత్రిగా వ్యవహరిస్తున్న కాకాణి సొంత గ్రామం తోడేరుకు సమీపంలోనే ఈ దందా జరిగింది. దాని పై ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పట్లో ఆందోళన కూడా చేశారు.
ఎన్నికల సమయంలో అప్పటి డీడీ శ్రీనివాస్‌కుమార్ ఇతర అధికారులు ఆ గనుల్ని పరిశీలించి సుమారు 61,313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు.సీనరేజీ ఛార్జీలతో పాటు పదింతల జరిమానా..మొత్తం రూ.7.56 కోట్లుగా లెక్క తేల్చి షోకాజ్ నోటీసులిచ్చారు.దీని పై ప్రస్తుత మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ గత నెల 16న పొదలకూరు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Also Read: Horoscope:ఈ రాశులవారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి...!
Also Read: Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రెండు సార్లు బాగా తాగి!
kakani-govardhana-reddy | Kakani Govardhan Reddy latest | ycp | ap-ycp | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates