Traffic Rules In AP: ఏపీలో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌... ఇక బాదుడే బాదుడు

ఏపీలో కొత్త ట్రాపిక్‌ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. మార్చి ఒకటో తేదీ నుండి నూతన రూల్స్ అమల్లోకి వస్తాయని ఇప్పటికే ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి 1 నుండి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రానుంది.

New Update
Traffic Rules

Traffic Rules

ఏపీలో కొత్త ట్రాపిక్‌ రూల్స్‌ (Traffic Rules) అమల్లోకి రానున్నాయి. మార్చి ఒకటో తేదీ నుండి నూతన రూల్స్ అమల్లోకి వస్తాయని ఇప్పటికే ఏపీ (AP) లోని ఆయా జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి ఒకటో తేదీ నుండి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రానుంది.ఈ చట్టాన్ని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి ఒకటో తేదీ నుండి నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే విధించే జరిమానాలను పెంచినట్లు ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్

ట్రాఫిక్‌ రూల్స్‌ మారుతున్నందున ప్రజలంతా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అలాగే వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ద్వీచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని,  కార్ల వంటి వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని లేని పక్షంలో అధిక జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించని పక్షంలో ఈ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.అందుకే ప్రతి వాహనదారుడు నిబంధనలు తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.  

Also Read: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

Also Read :  చికెన్ తింటే ఏం కాదు.. లైవ్ లో తిని చూపించిన హరీష్ రావు!

జరిమానాలివిగో....

డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 5000, వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి రూ. 2000, రెండవ సారి రూ. 4000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో రూ. 1500 ఫైన్‌ విధిస్తారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి రూ. 1000, అలాగే బైక్ వెనుక సీట్ లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించని పక్షంలో రూ. 1000 ,  అతివేగంతో వాహనాన్ని నడిపితే మొదటిసారి రూ. 1500, రెండవసారి రూ. 10000, ఆటో, లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించ కుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి రూ. 150, రెండవసారి రూ. 300, వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు రూ. 750, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించని పక్షంలో రూ. 1000, కారు డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించని పక్షంలో మరో రూ. 1000, వాహన రిజిస్ట్రేషన్ లేనిపక్షంలో రూ. 2000, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి రూ. 2000, రెండవ సారి రూ. 5000, రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి రూ. 5000, రెండవసారి రూ. 10000, మితిమీరిన వేగంతో వాహనం నడిపితే రూ. 1000, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తే రూ. 1000 జరిమానా విధించనున్నారు.

Also Read: ఇడ్లీ-సాంబార్‌ గోవా టూరిజాన్ని నాశనం చేసింది.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: వర్షిణీ మిస్సింగ్.. రంగంలోకి అఘోరీ- అరెస్టు చేయాలని డిమాండ్!

శ్రీవర్షిణీ ఇంకా ఇంటికి చేరుకోకపోవడంపై అఘోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. వర్షిణి మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటుంది. అంతేకాకుండా వర్షిణీ కుటుంబంతో విష్ణు డ్రామాలు ఆడుతున్నాడని చెప్తుంది. విష్ణుపై నిఘా పెట్టి కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తుంది.

New Update

అఘోరీ- శ్రీవర్షిణీ ఇష్యూ మరోసారి రచ్చకెక్కింది. ఇటీవల అఘోరీ నుంచి తన చెల్లి వర్షిణీని తీసుకొచ్చిన హర్ష, విష్ణులు.. ఆ తర్వాత ఒక హోటల్‌లో ఉన్నారు. రీసెంట్‌గానే వర్షిణీని ఇంటికి తీసుకొస్తున్నట్లు ట్రైన్‌లో ఉన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ ఇప్పటివరకు వారు ఇంటికి చేరుకోలేదు. దీంతో వారు ఎక్కడ ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

విష్ణుపై కేసు నమోదు చేయండి

ఈ నేపథ్యంలో లేడీ అఘోరీ రంగంలోకి దిగింది. RTV  ఛానెల్‌తో లైవ్‌లో మాట్లాడింది. వర్షిణీ అన్నయ్య విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేసింది. వర్షిణి మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటుంది. అంతేకాకుండా వర్షిణీ కుటుంబంతో విష్ణు డ్రామాలు ఆడుతున్నాడని చెప్తోంది. విష్ణుపై నిఘా పెట్టి కేసు నమోదు చేయాలంటూ చెప్పుకొస్తుంది. ఈ మేరకు శ్రీవర్షిణీ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని అఘోరీ అంటోంది. తన దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత వాళ్లు మొదటగా పోలీసుల వద్దకు వెళ్లాలని.. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ వద్దకు చేర్చాలని డిమాండ్ చేసింది. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

కానీ ఎక్కడా చేర్చకుండా ఎందుకు తిరుగుతున్నారు అని ప్రశ్నించింది. అసలు విష్ణుకి వర్షిణీ ఫ్యామిలీతో ఏంటి సంబంధం.. వారితో ఎందుకు ఆడుకుంటున్నాడు. ఇప్పటి వరకు ప్రజలు ఎంతో మంది తనను విమర్శించారని.. ఆడపిల్లను వదిలేయాలని అన్నారని.. కానీ ఇప్పటి వరకు వర్షిణీని ఇంటికి తీసుకెళ్లకపోవడానికి గల కారణం ఏంటని ఎందుకు ప్రశ్నించడంలేదు అని పేర్కొంది. నాలుగు రోజులు అవుతున్నా.. ఎందుకు వర్షిణీని ఇంటికి తీసుకెళ్లలేదు. ఆ పిల్లని ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

(sri varshini | aghori sri varshini | aghori | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment