AP News: డిస్కౌంట్ పేరిట భారీ మోసం.. కోట్ల రూపాయలు టోకరా!

ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని 'ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్' గృహ అవసర వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తామంటూ జనాలనుంచి కోటి రూపాయలు వసూల్ చేసి రాత్రికిరాత్రే పారిపోయారు. బాధితులు వారి దుకాణాల వద్ద ఆందోళనకు దిగారు.

New Update
RR Traders & Orders Suppliers 1 Crores Fraud

Nellore RR Traders & Orders Suppliers 1 Crore Fraud

AP News: ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని 'ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్' డిస్కౌంట్ పేరిట జనాలనుంచి కోటి రూపాయలు దోచేశారు. గృహ అవసర వస్తువులు అది తక్కువ ధరలకు ఇస్తామంటూ తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న దుండగులు అడ్వాన్సులు కట్టించుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. గత నెల రోజులుగా కోట బజారులో అద్దెకు రూములు తీసుకొని ఫర్నిచర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, దబారులు, బిందెలు మొదలుగు వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తామని నమ్మించి కోటి రూపాయలకుపైగా నగదుతో పరారయ్యారు. ఈ మేరకు 'RR ట్రేడర్స్' డిసెంబర్, జనవరి నెలల్లో కొద్దికొద్దిగా కట్టించుకుని తీరా మొత్తం కట్టగానే పారిపోయారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడిపిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న నగదు సైతం తీసుకుని మోసం చేశారని కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఆందోళన చెందుతున్న బాధితులు..


కోట మండల కేంద్రంలో గత నెలరోజుల ముందు ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్ పేరుతో రెండు దుకాణాలను అద్దెకు తీసుకుంది. పదిమంది ఎంప్లాయిస్ తో గృహ అవసరాలకు అవసరమయ్యే వస్తువులన్నిటిని డిస్ ప్లేలో పెట్టి మార్కెట్ రేటుకంటే సగం రేటుకే వస్తుందంటూ జనాలను నమ్మించింది. మొదట కట్టిన వారికి 10 నుంచి 20 రోజుల్లో వస్తువులు ఇచ్చి నమ్మించారు. 

ఇది కూడా చదవండి: Pandem kollu: కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. రూ.100కోట్ల బెట్టింగ్

తక్కువ సమయంలోనే వస్తువులు ఇవ్వడంతో ఆ నోట ఈ నోట భారీ స్థాయిలో పబ్లిసిటీ పెరిగింది. అధిక జనాలు లక్షల రూపాయలు కట్టడంతో ఒక్కసారిగా సుమారు కోటి రూపాయల పైన నగదుతో రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయారు. షాపుల్లో పనిచేయడానికి స్థానికంగా పెట్టుకున్న ఎంప్లాయిస్ వారికి ఫోన్లు చేసి వారి ఇళ్ల దగ్గరకు వెళితే వారు కనిపించకపోవడంతో విషయాన్ని బాధితులకు చేరవేశారు. విషయం తెలుసుకున్న బాధితులు భారీ స్థాయిలో దుకాణాల వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: NagaVamsi : ఊర్వశిని కొట్టింది నేను కాదు బాలయ్య.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment