/rtv/media/media_files/2025/01/15/WN2Jk25m0zipJkC86o03.jpg)
manchu family Photograph: (manchu family)
Mohanbabu Vs manoj: మోహన్‌బాబు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. తిరుపతిలోని విద్యానికేతన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. అవ్వ, తాతల సమాధుల వద్ద నివాళులు అర్పించేందుకు రానివ్వకపోవడంతో మనోజ్ బలవంతంగా గేట్లు తోసుకుని వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్‌బాబు, మనోజ్ బౌన్సర్లు తన్నుకున్నారు.
గేట్లు తీయాలంటూ అరిచిన మనోజ్..
ఈ మేరకు తమ తాత-నానమ్మల వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న వారి సమాధుల వద్ద నివాళులు అర్పించేందుకు మనోజ్ తన భార్యతో కలిసి వెళ్లాడు. అయితే వారిని పోలీసులు, సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఇటీవల నమోదైన కేసు కోర్టు పరిధిలో ఉన్న కారణంగా లోనికి అనుమతించే వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కనీసం వారి సమాధులకు దండంపెట్టుకుని వెళ్తానని మనోజ్ చెప్పాడు. అయినప్పటికీ వినకపోవడంతో మోహన్ బాబు బౌన్సర్లను అరేయ్ గేట్లు తియ్యండ్రా అంటూ గట్టిగా కేకలు వేశాడు. రోడ్డుమీద ట్రాఫిక్ జామ్ కావడతో అనవసరంగా కాలేజీ ముందు ఉన్న దుకాణ దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డాడు. మనోజ్ అవ్వతాతల సమాధి వద్దకు వెళ్లేందుకు వీలైతే ఎస్పీ దగ్గరకి వెళ్తానని చెప్పాడు మనోజ్.
ఇది కూడా చదవండి: TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపరాఫర్.. 40 వేల ఉద్యోగాలు!
ఇక మీడియాతో మాట్లాడుతూ..మోహన్ బాబు నార్త్ నుంచి బౌన్సర్లను తెప్పించుకుని దారుణం చేస్తున్నారని ఆరోపించాడు. 'నేను వెనక్కి వెళ్లను. దమ్ముంటే అరెస్టు చేసుకోండి. గొడవ చేసేందుకు రాలేదు. ఈ క్యాంపస్ ఒక్కరిదే కాదు. అభిమానులు ఏర్పాటు చేసిన నా ఫ్లెక్సీలు కావాలనే చించి వేశారని అన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. నన్ను ఎలా అడ్డుకుంటారు. గొడవ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. అనుమతిస్తే సమాధుల వద్దకు వెళ్లి దండం పెట్టుకుని వెళ్లిపోతానని చెప్పాడు. నార్త్ బౌన్సర్లకు తాను ఒక్కడినే చాలని ఒక్కొక్కడి తోలు తీస్తానన్నారు. ఇదే క్రమంలో గొడవ మరింత ముదరడంతో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవకు దిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.
ఇది కూడా చదవండి: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఎన్నిక రద్దు?