/rtv/media/media_files/2026/02/20/lokesh-2026-02-20-11-07-58.jpg)
Lokesh Directs officials to focus on job creation for youths in Andhra pradesh
Jobs Alert: ఏపీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉండవల్లి నివాసంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో కొత్తగా ఏర్పాటుచేయనున్న విదేశీ యూనివర్సిటీలకు ప్రోత్సహకాలు, విధివిధానాలపై చర్చలు జరిపారు.
'' రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న క్రమంలో ఉపాధి కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలి. గ్రౌండ్ అయినటువంటి ఇండస్ట్రీల్లో ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనికి తగ్గట్లు అధికారులు రోడ్ మ్యాప్ రూపొందించాలి. రిలయన్స్ CBG, జూపిటర్, లారెన్స్ ఫార్మా, హెటెరో డ్రగ్స్‌తో సహా రాష్ట్రంలో కొత్తగా వస్తున్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను కావాల్సిన నైపుణ్యాలను యువతకు అందించాలి. దీనికి కావాల్సిన కరికులం రూపకల్పనలో ప్రముఖ పరిశ్రమల నుంచి సలహాలు తీసుకోవాలి.
Also Read: విభిన్న వాతావరణం.. ఉత్తర భారత్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు, దక్షిణాదికి వర్షాలు
పలు సంస్థలు ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఇదే తరహాలో ఐటీఐలకు అనుబంధంగా ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు నెలలకోసారి నిర్వహిస్తున్న జాబ్ మేళా ద్వారా యువతకు ఉద్యోగాల లభిస్తున్నాయని'' లోకేశ్ అన్నారు. అలాగే త్వరలో స్కిల్ పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికారులు కూడా దీనిపై స్పందించారు. 25 రంగాల డేటా ఇంటిగ్రేషన్ పూర్తయినట్లు తెలిపారు. ఇందులో 1,14,899 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. వీటిలో 3100 విదేశీ ఉద్యోగాలున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన 16 మంది రిక్రూటర్స్ రెడీగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో ట్రయల్ బేసిస్‌లో 20 వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారని.. 60 వేల మంది జాబ్ సీకర్స్‌కు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Also Read: ఇరాన్‌పై అమెరికా దాడులకు ప్లాన్.. పర్మిషన్ ఇవ్వని యూకే
Follow Us