🔴Live News Updates: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

IPL: కేకేఆర్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టులోని కీలక ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ గాయం కారణంతో లీగ్‌కి దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ జట్టు ఇతని స్థానంలో ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ సకారియా వచ్చాడు. రూ.75లక్షలకు కేకేఆర్ జట్టు తీసుకుంది.

IPL
IPL Photograph: (IPL)
 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య జరగనుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టులోని కీలక ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ గాయం కారణంతో లీగ్‌కి దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ జట్టు ఇతని స్థానంలో ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ సకారియా వచ్చాడు. అయితే ఈ విషయాన్ని కేకేఆర్ జట్టు స్వయంగా ప్రకటించింది. ఉమ్రాన్ మాలిక్ గతంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తరఫున ఆడగా.. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి వచ్చాడు. కానీ గాయం కారణం చేత దూరమయ్యాడు. 

చేతన్ సకారియా భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అతను ఒక వన్డే, రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తం 19 మ్యాచ్‌లలో 20 వికెట్లు పడగొట్టాడు. సకారియాను కేకేఆర్ రూ.75లక్షలకు జట్టులోకి తీసుకుంది. అయితే మొదట ఐపీఎల్-2025 వేలంలో చేతన్‌ను ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. కేకేఆర్ జట్టులో నెట్ బౌలర్‌గా చేరాడు. ఇప్పుడు ఇమ్రాన్ మాలిక్ స్థానంలో కేకేఆర్ అతనిని జట్టులోకి తీసుకుంది.

ఇది కూడా చూడండి: PM Modi: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ

కేకేఆర్ తుది జట్టు అంచనా

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్ట్జే/స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి.

ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?

  • Mar 17, 2025 19:06 IST

    యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు

    బెట్టింగ్ యాప్‌‌లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రా్ల్లో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫూఎసర్లులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

     betting apps
    betting apps Photograph: ( betting apps)

     



  • Mar 17, 2025 13:57 IST

    Betting Apps: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో కాజల్.. రంగంలోకి సజ్జనార్?

    బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఈ క్రమంలో కాజల్ గతంలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్న వీడియో బయట పడింది. దీంతో  ఓ నెటిజన్ ఈ వీడియోను వీసీ సజ్జనర్ కి ట్యాగ్ చేస్తూ సెలబ్రెటీలకు సామాన్యుడికి ఎప్పుడూ ఈ పక్షపాతం ఎందుకు అని ట్వీట్ చేశాడు.

    kajal promoting betting app
    kajal promoting betting app

     



  • Mar 17, 2025 11:49 IST

    PM Modi: విదేశీ పాడ్‌కాస్ట్‌లో మోదీ.. కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

    అమెరికాకు చెందిన ఏఐ పరిశోధకుడు లెక్స్‌ ఫ్రిడ్‌మాన్‌.. భారత ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశీ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ సౌకర్యంగా కూర్చోని ఉంటారంటూ కాంగ్రెస్‌ ఎక్స్‌ వేదికగా సెటైర్లు వేసింది.పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

    PM Modi
    PM Modi

     



  • Mar 17, 2025 08:34 IST

    Sunita Williams: భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్‌.. టైమ్‌ చెప్పిన నాసా

    భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌ భూమి మీదకు రానున్నారు. మరికొన్ని గంటల్లోనే వాళ్ల తిరుగుప్రయాణం మొదలుకానుంది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు.

    sunita williams and butch wilmore
    sunita williams and butch wilmore

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు