ఆంధ్రప్రదేశ్ AP: చాలా దుర్మార్గంగా వ్యవహరించారు: రామచంద్రయ్య ఎమ్మెల్సీగా టీడీపీ నేత సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాక్షస పాలన నచ్చక బయటకు వచ్చినట్లు చెప్పారు. తన రాజీనామా విషయంలో గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రేవంత్ తో షర్మిల భేటీ! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహించే వైఎస్సార్ జయంతి వేడుకలకు హాజరుకావాలని రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించారు. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : అవినీతికి పాల్పడితే అంతే.. సబ్ రిజిస్ట్రార్ తో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే..! అవినీతికి పాల్పడనంటూ ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ తో వెంకటేశ్వర స్వామి పటంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని అవినీతికి పాల్పడవద్దని హెచ్చరించారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM : పోలీసులపై మంత్రి భార్య చిందులు...సీఎం సీరియస్! ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు కానీ, ఆమె మాట్లాడిన విధానం గురించి సర్వత్రా విమర్శలకు దారి తీసింది.ఈ విషయం గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. ఇది మనకు ముఖ్యం: షర్మిల ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని APCC చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వేల కోట్లను ఇలానే ఖర్చు చేస్తాం.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సెన్సేషనల్ ఇంటర్వ్యూ..! ఆడుదాం ఆంధ్రాలో జగనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. ఇక రోజా ఎంత అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సెటైర్లు వేశారు. కేంద్రం క్రీడల కోసం రూ. 30వేల కోట్లు ఖర్చు చేస్తోందని.. ఆ నిధులతో గ్రామస్థాయి క్రీడాకారులను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan & KCR: డీఎస్ మృతిపై మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం కాంగ్రెస్ నేత శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రల మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో డి.శ్రీనివాస్‌కి ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని గుర్తుచేసుకున్నారు జగన్. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : జగన్ సంచలన నిర్ణయం.. హిమాలయాలకు వెళ్లేందుకు ప్లాన్! AP: ఎన్నికల్లో ఓటమి తరువాత హిమాలయాలకు వెళ్లాలని అనుకున్నట్లు జగన్ నేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ 40 శాతం ఓట్లు చూసి ఆగిపోయానని.. ఓటమి నుంచి కోలుకోడానికి తనకు 2,3 రోజులు పట్టిందని అన్నారని చర్చ సాగుతోంది. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కానిస్టేబుల్ కనుసన్నల్లో ఎర్రచందనం అక్రమ రవాణా..! కడప జిల్లా బసాపురం టోల్ ప్లాజా వద్ద ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు. అయితే, ఎర్రచందనం తరలింపులో ఓ కానిస్టేబుల్ పాత్రపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn