Sharmila: జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు! AP: జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై షర్మిల విమర్శలు చేశారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని.. సొంత మైకుల ముందు కాదు.. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని అంటూ చురకలు అంటించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజాసమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలన్నారు. By V.J Reddy 14 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Sharmila: తన సోదరుడు, మాజీ సీఎం జగన్ పై మరోసారి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగతుంటే జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని.. సొంత మైకుల ముందు కాదు..అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని అంటూ చురకలు అంటించారు. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి అంటూ ఫైర్ అయ్యారు. ఇది కూడా చదవండి: TG:టీచర్ ఉద్యోగాల భర్తీలో గందరగోళం.. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్.. ! దమ్ము లేకుంటే రాజీనామాలు... షర్మిల ట్విట్టర్ లో.. " ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ, YCP కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. మేము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీకు మాకు పెద్ద తేడా లేదు. జగన్ మోహన్ రెడ్డి గారికి 38 శాతం వచ్చినా.. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, మీకు మాకు తేడా లేదు. ఇది కూడా చదవండి:AP Crime: తిరుపతిలో ఘోర ప్రమాదం...ఇద్దరు మహిళలు మృత్యువాత 38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోనీ YCP నీ నిజానికి ఒక "ఇన్ సిగ్నిఫికెంట్"పార్టీగా మార్చింది జగన్ మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని , అసమర్థ వైసీపీ ఇవ్వాళ రాష్ట్రంలో అసలైన "ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ". ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. సొంత మైకుల ముందు కాదు..అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి. ప్రతిపక్షం కాకపోయినా..11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా.. YCP ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి.. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయండి." అంటూ విమర్శలు గుప్పించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది YCP @YSRCParty అధ్యక్షుడు @ysjagan వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ, YCP కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. మేము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి… — YS Sharmila (@realyssharmila) November 14, 2024 ఇది కూడా చదవండి: కలెక్టర్ వస్తే తరిమికొడదాం.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో విడుదల! ఇది కూడా చదవండి: భారీగా తగ్గిన బంగారం ధరలు.. మహిళలకు ఈ ఛాన్స్ మళ్లీ రాదు #jagan #sharmila #ap-assembly-sessions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి