Jagan: సీఎం చంద్రబాబుపై 420 కేసు.. జగన్ సంచలనం AP: చంద్రబాబపై జగన్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో చంద్రబాబు ఎగ్గొట్టారని అన్నారు. 'నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?', నీపై 420కేసు ఎందుకు పెట్టకూడదు.' అని చంద్రబాబును నిలదీశారు. By V.J Reddy 14 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YCP Chief Jagan: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ సీఎం చంద్రబాబుపై మరోసారి నిప్పులు వర్షం కురిపించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ పై జగన్ విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ వేదికగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబును నిలదీశారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చినా మీరు.. ఆ హామీల ప్రస్తావన రాష్ట్ర బడ్జెట్ లో ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలు గాలిలో కాలిపోయాయి అంటూ చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చిన నీపై ఎందుకు 420 కేసు పెట్టకూడదు అని ప్రశ్నించారు జగన్. Also Read: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..16 వేల ఉద్యోగాల భర్తీ! ఏం చేసుకుంటావో చేసుకో..! జగన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో... " చంద్రబాబు గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా? అంటూ... * ఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్? * దీపం:ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్? * తల్లికి వందనం:ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్? * అన్నదాత:ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్? * ఉచిత బస్సు ప్రయాణం:రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు. * యువగళం:రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్ * 50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్. * నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు? ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు.నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు." అని ప్రశ్నల దాడి చేశారు. Also Read: Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! .@ncbn గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?ఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2024 Also Read: USA: విజయం తర్వాత మొదటిసారి వైట్ హౌస్‌కు ట్రంప్..బైడెన్‌తో భేటీ Also Read: స్పెర్మ్ ఇస్తా..ఐవీఎఫ్ చికిత్స కూడా ఉచితం– టెలీగ్రాం సీఈఓ వింత ఆఫర్ #chandrababu #jagan #andhrapradesh #tdp-vs-ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి