ఆంధ్రప్రదేశ్ AP : 450 నిమ్మ చెట్లను నరికేసిన దుండగులు..! అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఐదు ఏకరాల్లోని 450 నిమ్మ చెట్లను దుండగులు నరికేశారు. భూ వివాదమే కారణమని తెలుస్తోంది. చంద్రారెడ్డి అనే వ్యక్తి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమి తనదే అంటున్నాడని బాధితురాలు మంజుల వాపోయింది. చెట్ల నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అక్రమ ఇసుక దందా.. యువకుడు బలి..! కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ ఇసుక దందాకు యువకుడు బలి అయ్యాడు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఈబి, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా పడి ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి అన్నమయ్య జిల్లా నందలూరులో కడప - చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో.. లారీ డ్రైవర్, బస్సు కండక్టర్ అక్కడిక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Proddatur: భార్య వివాహేతర సంబంధం.. భర్త చేసిన పనికి కంగుతిన్న పోలీసులు! అక్రమ సంబంధం అనుమానం ఓ ఇల్లాలి ప్రాణం తీసింది. ప్రొద్దుటూరు దోడియంకు చెందిన అన్వర్ బాషా తన భార్య రేష్మను అనుమానంతో గొంతుపిసికి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బీజేపీకి కొత్త నిర్వచనం చెప్పిన షర్మిల.. కూటమి ప్రభుత్వంపై ఫైర్! ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని APCC చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని బీజేపీ పార్టీలేనన్నారు. బీజేపీ అంటే బాబు, పవన్, జగన్ అని అభివర్ణించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఆందోళన.. టీడీపీ, వైసీపీ మధ్య వార్..! కడప జిల్లా పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. న్యాక్ బిల్డింగ్ సమీపంలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అడ్డొచ్చిన అబ్దుల్ మేనమామను సైతం తలపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డీలర్లకు ఏమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వార్నింగ్.! సివిల్ సప్లయిస్లో భారీగా గోల్ మాల్ జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిల్లర్ల నుంచి సివిల్ సప్లయిస్ గోడౌన్ కు బియ్యం చేరేటప్పుడు భారీ స్కాం జరుగుతోందన్నారు. ఒక్కో బస్తాకు 5 కిలోల వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిపారు. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆ వ్యవస్థను రూపు మాపుతా.. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు.! ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా మార్చడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. ఇప్పటికే అధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. ఏ ఒక్కరు అవినీతికి పాల్పడినా సహకరించేదే లేదని తేల్చిచెప్పారు. ప్రజలకు సేవ చేసే వారినే అధికారులుగా నియమిస్తామన్నారు. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan vs Sharmila : కడప గడపలో వైఎస్ వారసుల బాహా బాహీ తప్పదా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీచేయనున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, ఆయనపై వైఎస్ షర్మిల పోటీకి దిగుతారని అంటున్నారు. ఈ ఊహాగానాల వెనుక కథేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn