/rtv/media/media_files/2025/01/23/wUDRdLRonFRvyC7d1YJQ.jpg)
Inter student walks out of class, jumps to death from 3rd floor
Inter Student Suicide: ఈ మధ్యకాలంలో జీవితాన్ని ఇంకా చూడని యువతీ, యువకులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పరీక్షల్లో ఫెయిలయ్యామని, చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని, ఉద్యోగం రాలేదనే కారణంతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి క్లాస్ రూం నుంచి బయటికి వచ్చి మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది.
చెప్పులు విడిచి.. గోడపై నుంచి దూకి
ఇక వివరాల్లోకి వెళ్తే.. అనంతరపురంలోని నారాయణ కాలేజ్‌లో చరణ్ (16) అనే యువకుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గురువారం ఎప్పట్లాగే కాలేజీలో క్లాసులు జరుగతున్నాయి. ఈ క్రమంలోనే క్లాస్ మధ్యలోనుంచి సడెన్‌గా లేచి నడుచుకుంటూ వెళ్లాడు. గది ప్రవేశం చెప్పులు విడిచిపెట్టాడు. ఆ తర్వాత నేరుగా ముందుగా ఉన్న మూడవ అంతస్తు గోడపై నుంచి కిందకి దూకేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన చరణ్‌ను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే చరణ్ ప్రాణాలు విడిచాడు. అతడు మూడవ అంతస్తు నుంచి దూకిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
సీసీ ఫుటేజ్
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2025
అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో బిల్డింగ్ పై నుండి దూకి ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య
ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ క్లాస్ జరుగుతుండగానే బయటికి వచ్చి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
సూసైడ్ చేసుకోవడంతో బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు pic.twitter.com/kCDeMmMIfn
Also Read: జమ్మూకశ్మీర్‌లో మిస్టరీ మరణాలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి
అయితే చరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కుమారుడి మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా కాలేజ్ ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. నారాయణ కాలేజ్‌ను మూసివేయాలని, కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కళాశాలకు చేరుకున్నారు. అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభినట్లు పేర్కొన్నారు.
Also Read: Maharashtra Train Accident: 12 మంది ప్రాణాలు తీసిన పుకారు.. రైలు ప్రమాదానికి ఇదే కారణం