/rtv/media/media_files/2024/11/28/l7o3be3KRS6JrsE1RGLS.webp)
ఏపీలో నేడు పలు చోట్ల వర్షం పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణశాఖ ప్రకటించింది. గురువారం రాయలసీమలో, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. వేసవిలో అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద ఉండకూడదని సూచించారు.
Also Read: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
మంగళవారం శ్రీకాకుళం -6, విజయనగరం -6, పార్వతీపురంమన్యం -10, అల్లూరి సీతారామరాజు -3, తూర్పుగోదావరి కోరుకొండ 26 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. సోమవారం నంద్యాల గోస్పాడులో 40.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.2, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం.
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర, అంతర్గత విదర్భ మీదుగా విస్తరించి కొనసాగుతోంది. ఉత్తర - దక్షిణ ద్రోణి మరట్వాడ ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు వరకు విస్తరించనుంది. మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
మంగళవారం(01-04-25) శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-6, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-3, తూర్పుగోదావరి కోరుకొండ మండలాల్లో(26) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.https://t.co/5OKi6Dg4UL pic.twitter.com/efETriPMd7
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) March 31, 2025
బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశాలు కనపడుతున్నాయి.
మరోవైపు తెలంగాణలో కూడా 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మంగళ, బుధ, గురువారాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మొదలై ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి.
నాలుగో తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది.ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 50 కిలోమీటర్లలోపు ఈదురు గాలులు వీస్తాయి అంటున్నారు. అయితే ఈ వర్షాల కారణంగా 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంటుందంటున్నారు.
Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!
Also Read:Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి
weather | Andhra Pradesh and Telangana Weather Report | andhra pradesh weather | ap today weather update | ap-weather | AP Weather Alert | latest-news | telugu-news | latest telugu news updates | latest-telugu-news