IMD -Ap: మరో నాలుగు రోజులు వడగళ్ల వానలు..జాగ్రత్త..వాతావరణ శాఖ హెచ్చరికలు!

ఏపీలో అకాల వర్షాలు.. మరో నాలుగు రోజులు కురుస్తాయని ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.క్యుములో నింబస్ మేఘాలతో వర్షం, వడగళ్ల వాన, పిడుగులు పడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

New Update
hyd

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.. చేతికి అందివచ్చిన పంట.. అకాల వర్షం నేలపాలు చేసింది.. వేలాది ఎకరాల్లో పంట నష్ట వాటిల్లింది. అయితే, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ చేసిన హెచ్చరికలు ఇప్పుడు టెన్షన్‌ పెడుతున్నాయి. ఏపీలో అకాల వర్షాలు.. మరో నాలుగు రోజులు కురుస్తాయని ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.

Also Read: PawanKalyan: తమిళనాడులో జనసేన.. పవన్ సంచలన ప్రకటన!

క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వడగళ్ల వాన పడుతుందని పేర్కొంది.. ఇక, విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోంది.. బంగాళాఖాతంలో బలంగా విస్తరిస్తోంది ద్రోణి ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో వీచే గాలుల కారణంగా ఏర్పడుతున్న క్యుములో నింబస్ మేఘాలతో వర్షం, వడగళ్ల వాన, పిడుగులు పడతాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. పంట పొలాల్లో ఉండే వాళ్లు వర్షం కురిసే సమయంలో చెట్లకు దూరంగా ఉండాలని తెలిపారు.

Also Read: Hamas: హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు.. కీలక నేతలు మృతి!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో గత మూడు రోజుల నుంచి భిన్న వాతావరణం నెలకొంది. గత రెండు మూడు రోజులుగా ఓవైపు ఎండలతో పాటు మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో తీవ్రస్థాయిలో పంట నష్టం కలిగింది. ఇక రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో తక్కువగా ఉష్టోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది. అయితే రాబోయే రెండు రోజులు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. చెట్లు, విద్యుత్ స్థంబాల దగ్గర ఎవరు ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. నిన్న పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. వర్షం కారణంగా కొందరి రైతుల పంటల్లో భారీగా వరద నీరు చేరుకుంది. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. అకాల వర్షాలు పట్ల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Tech Mahindra: ఖతార్ లో గుజరాత్‌ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్

Also Read: Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..!

ap | imd | imd alert | imd-issued-heavy-rain-alert | imd-issued-heavy-rain-alert-in-ap | weather | ap-weather | AP Weather Alert | andhra pradesh weather | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment