Bullet Train: హైదరాబాద్‌ టు చెన్నై బుల్లెట్ ట్రైన్.. వయా అమరావతి

హైదరాబాద్‌ నుంచి చెన్నై మధ్య బుల్లెట్‌ ట్రైన్ రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూట్‌ను అమరావతి మీదుగా వెళ్లేలా అధికారులు డ్రాఫ్ట్‌ ప్లాన్ రెడీ చేశారు. ఈ రైలు మార్గం అమరావతిలోని పశ్చిమ బైపాస్, N6 రోడ్డు గుండా వెళ్లనుంది.

New Update
hyderabad-chennai bullet train via amaravati

hyderabad-chennai bullet train via amaravati

హైదరాబాద్‌ నుంచి చెన్నై మధ్య బుల్లెట్‌ ట్రైన్(bullet-train) రానున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ రూట్‌ను అమరావతి మీదుగా వెళ్లేలా అధికారులు డ్రాఫ్ట్‌ ప్లాన్ రెడీ చేశారు. ఈ రైలు మార్గం అమరావతిలోని పశ్చిమ బైపాస్, N6 రోడ్డు గుండా వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులో వచ్చాక హైదరాబాద్, అమరావతి, చెన్నై మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. ఈ కారిడర్‌ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. 

Also Read: బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మృతి!

కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్

మరోవైపు అమరావతిని దేశంలోని ప్రధాన రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించేలా కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లాలోని నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వల్ల అమరావతికి రైలు సౌకర్యం రావడమే గాక.. ఉత్తర, దక్షిణ భారత్‌లోని ప్రధాన నగరాలతో అనుసంధానం మరింత సులభతరం కానుంది. 

Also Read: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌ సభ ఆమోదం..కొత్త రాజధానిని ప్రతిపాదించిన జగన్‌

ఈ ప్రాజెక్టులో అత్యంత ఆకర్షణీయమైన విషయం కృష్ణా నదిపై నిర్మించబోయే 3 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్ రైల్వే బ్రిడ్జి. ఇది అమరావతిలోనే అతిపెద్ద రైల్వే వంతెనలలో ఒకటిగా రికార్డు సృష్టించనుంది. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనున్న ఈ బ్రిడ్జి రాజధానికి మరింత గుర్తింపును తీసుకురానుంది. రైల్వే ప్రయాణికులకు మాత్రమే కాక వస్తు రవాణాకు కూడా ఈ రైల్వేలైన్ కీలకంగా మారనుంది. పరిటాల వద్ద మల్టీ మోడల్‌ కార్గో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీన్నివల్ల ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందనుంది. 

Advertisment
తాజా కథనాలు