Honey Bees Attack: చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!

ఏపీలోని అల్లూరి జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అంతిమయాత్ర సమయంలో టపాసులు పేల్చడంతో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా బంధువలపై దాడి చేశాయి. దీంతో వారు మృతదేహాన్ని రోడ్డుపై వదిలి పారిపోయారు. ఈ దాడిలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

New Update
honey bees attack during funeral at Alluri Sitarama Raju District of ap

honey bees attack during funeral at Alluri Sitarama Raju District of ap

ఏపీలో ఊహించని ఘటన జరిగింది. అంతిమయాత్ర జరుగుతుండగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దీంతో శవాన్ని నడి రోడ్డుపైనే వదిలేసి కుటుంబ సభ్యులు, బంధువులు పరుగులు పెట్టారు. ఇంతకీ ఏం జరిగింది. శవాన్ని రోడ్డుపైనే వదిలేసి పరుగులు పెట్టాల్సిన పని ఏమొచ్చింది అనే విషయానికొస్తే.. 

ఇది కూడా చూడండి: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

షాకింగ్ ఇన్సిడెంట్

ఏపీలోని అల్లూరి జిల్లాలోని గన్నేరు కొయ్యపాడులో కొప్పుల పల్లాయమ్మ (86) మృతి చెందింది. దీంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అంతిమయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే శవాన్ని పాడెపై ఎక్కించి తీసుకెళ్తుండగా.. అదే సమయంలో బాణాసంచా కాల్చారు. 

ఇది కూడా చూడండి: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

దీంతో అందులో కొన్ని టపాకాయలు పక్కనే ఉన్న చెట్టుపై పడ్డాయి. సరిగ్గా అక్కడే తేనెతుట్టు ఉండటంతో దానికి ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా చెల్లా చెదురయ్యాయి. అదే సమయంలో అంతిమయాత్రలో ఉన్న వారిపై ఏకదాటిగా దాడి చేశాయి. దీంతో అంతిమయాత్రలో పాల్గొన్నవారంతా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు పెట్టారు. 

ఇది కూడా చూడండి: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని గౌరీదేవి పేట PHCకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకొంతమంది భద్రాచలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఈ తేనెటీగల దాడి అనంతరం బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో ఈ ఘటనతో చాలా మంది ఉలిక్కి పడ్డారు. చావుకు వెళ్తే చచ్చేంత పనైందిరా బాబు అంటూ పలువురు బందువులు మాట్లాడుకుంటున్నారు. 

ఇది కూడా చూడండి: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

(latest-telugu-news | telugu-news | viral-news | ap-news)

 

Advertisment
Advertisment
Advertisment