/rtv/media/media_files/2024/11/09/ZsEgjdqCE0r5ClhYTJ5s.jpg)
Vallabhaneni Vamsi :వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారన్న ఆమె, నిన్న డీజీపీ బిజీగా ఉండి ఉండచ్చని అన్నారు. ఈ 8 నెలల్లో వైఎస్సార్సీపీ నేతలు ఎన్నిసార్లు డీజీపీని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారని అనిత ప్రశ్నించారు. వంశీ అరెస్టు అక్రమం కాదని సక్రమమేనని దానికి అన్ని ఆధారాలు ఉన్నాయని మంత్రి వివరించారు. కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు చెప్పినట్లు హోం మంత్రి తెలిపారు.
పెద్ద సైకోని సంతృప్తి...
గన్నవరం పార్టీ కార్యాలయం దాడి ఘటనలో 71వ నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ తానంతట తానే వచ్చి కిడ్నాప్ కేసులో ఏ1గా ఇరుక్కున్నాడని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. వంశీ చరిత్ర మొత్తం అరాచకమయమని మండిపడ్డారు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ పెద్ద సైకోని సంతృప్తి పరిచేందుకు ఇష్టానుసారంగా విధ్వంసం సృష్టించాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఒక ఎస్సీ యువకుడిని తక్కువ చులకన చేసి, బలిపశువుని చేద్దామని చూసి అడ్డంగా దొరికాడని విమర్శించారు. వంశీ లాంటి దుర్మార్గులను సంఘ బహీష్కరణ చేయాలని సూచించారు. వంశీ లాంటి వ్యక్తి జైల్లో ఉంటేనే సమాజానికి మంచిదని వెల్లడించారు.
వైఎస్సార్సీపీ హయంలో అధికారం అండతో రెచ్చిపోయిన వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతోపాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో నాటకీయ పరిణామాల మధ్య వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు.
Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన