'BIG ANNOUNCEMENT' అంటూ లోకేష్ ఆసక్తికర ట్వీట్!
AP: మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈరోజు పెద్ద ప్రకటన చేయనున్నట్లు తన ట్విట్టర్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.
AP: మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈరోజు పెద్ద ప్రకటన చేయనున్నట్లు తన ట్విట్టర్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.
కుటుంబ కలహాల కారణంగా అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. తుళ్లూరులో ఉంటున్న అత్త నాగమణికి, కోడలు పావనికి గత కొన్ని రోజులు నుంచి గొడవలు జరుగుతున్నాయి. తాజాగా గొడవ ముదరడంతో కోడలు ఏకంగా అత్త చెవిని కొరికేసింది.
AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై మోదీతో చర్చించనున్నట్లు సమాచారం.
ఏపీ మద్యం టెండర్స్ లో అధికార పార్టీకి చెందిన వారు సిండికేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మైక్కైనట్లు RTV పరిశోధనలో తేలింది. అనేక చోట్ల మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
AP: సోషల్ మీడియాలో ఉచిత ఇసుక పథకంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
AP: చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్సే అని వైసీపీ విమర్శలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లడ్డూ కల్తీ వివాదంపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ టీడీపీని ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించింది.
AP: లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ స్పందించారు. చంద్రబాబు నిజస్వరూపం సుప్రీం కోర్టుకు తెలిసిందని.. అందుకే ఆయన వేసిన సిట్‌ను రద్దు చేసిందని అన్నారు. అసలు లడ్డూలో కల్తీ జరగలేదని.. దీనిపై విచారణకు సిట్ అవసరం లేదని అన్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో మేనేజర్‌గా పనిచేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్‌గా హరీశ్ ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం రుణాల నుంచి కోట్ల నగదు అకౌంట్లలో బదిలీ చేసుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.