BREAKING: సీఎం చంద్రబాబు సీరియస్!

AP: సోషల్ మీడియాలో ఉచిత ఇసుక పథకంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

New Update
Chandrababu on Vijayawada floods

CM Chandrababu: ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశం ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా జరుగుతున్న దుష్ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని.. తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ALSO READ: హైడ్రా, నామినేటెడ్ పదవులపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన

ఇటీవల ఇసుకపై కీలక ప్రకటన...

ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు నిబంధనలను గనులశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కె.మీనా జారీ చేశారు.

ఇల్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్..

ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి దసరా పండుగ సమీపిస్తున్న క్రమంలో చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. ప్రస్తుతం ఇసుక కోసం ఇక్కట్లు పడుతున్న వారికి కాస్త ఊరటనిచ్చే వార్తను చెప్పింది. ఈ నెల 15 నుంచి ఇసుక రీచ్‌లలో పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అక్టోబర్ 15 నుంచి ఏపీలో ఇసుక కొరత ఉండదని అన్నారు. 15 నుంచి అందరికి ఇసుక అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. వానాకాలంలో వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకొని గతంలో  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక రీచ్‌లలో తవ్వకూడదని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకే రీచ్‌లలో ఇసుక తవ్వకాలను నిలిపివేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు