అసలు కల్తీ లేదు.. సిట్ అవసరమే లేదు.. జగన్ షాకింగ్ కామెంట్స్ AP: లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ స్పందించారు. చంద్రబాబు నిజస్వరూపం సుప్రీం కోర్టుకు తెలిసిందని.. అందుకే ఆయన వేసిన సిట్‌ను రద్దు చేసిందని అన్నారు. అసలు లడ్డూలో కల్తీ జరగలేదని.. దీనిపై విచారణకు సిట్ అవసరం లేదని అన్నారు. By V.J Reddy 04 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Jagan: తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు నిజస్వరూపం సుప్రీం కోర్టుకు తెలిసిందని.. అందుకే సుప్రీం కోర్టు ఆయన వేసిన సిట్ ను రద్దు చేసిందని అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు తెలిపిందని అన్నారు. రాజకీయ డ్రామాలు చేయొద్దని వారిని హెచ్చరించిందని చెప్పారు. లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని అబద్దాలు చెప్పారని ఫైర్ అయ్యారు. తిరుమలను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గు లేదు... సుప్రీం కోర్టు చంద్రబాబుకు మొట్టకాయలు వేసిందని అన్నారు జగన్. చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తిచూపిందని చెప్పారు. కల్తీ లడ్డూ అంశంపై సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో చేసిన వ్యాఖ్యల్లో వ్యత్యాసం ఉందని అన్నారు. దేవుడు అంటే భయం లేకుండా.. ఇప్పటికే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు భయం లేదు, భక్తి లేదు అని విమర్శించారు. ఇంత జరిగిన చంద్రబాబులో పశ్చాతాపం కనిపించడం లేదని అన్నారు. టీటీడీలో గొప్ప వ్యవస్థ ఉందని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్.. సుప్రీంకోర్టు ఎవరిని తిట్టింది..? బుక్కైంది ఎవరు..? అని జగన్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించినా చంద్రబాబుకు పట్టడంలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేశానని తిరుమలలో స్వామివారిని వేడుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తే.. ఇచ్చిన హామీలను ఎగగొట్టేందుకు చంద్రబాబు కల్తీ లడ్డూ వివాదం తెరపైకి తెచ్చి డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టే చర్యలు చంద్రబాబు మానుకోవాలని అన్నారు. సిట్ లేదు.. బిట్ లేదు.. కల్తీ లడ్డూ కేసు విచారణలో సిట్ అవసరంలేదు.. బిట్ అవసరం లేదని అన్నారు జగన్. అసలు ఏం జరగనిదానికి విచారణ ఎందుకు? అని నిలదీశారు. జరగనిదాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేసుకుంటున్నారని ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదని హెచ్చరించారు. ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు.. తప్పుడు రిపోర్ట్ ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారని వ్యాఖ్యానించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి