Google: ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందాలు

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యా్ప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్సెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కమార్ అమరావతి ఏసీ సచివాలయంలో మొమోరెండ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

New Update
AP

ఏఐ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యా్ప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్సెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కమార్ అమరావతి ఏసీ సచివాలయంలో మొమోరెండ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ లివింగ్ మా ప్రభుత్వ లక్షమని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

ఇది కూడా చదవండి : AP: ఏపీలో వారందరికి ఉచితంగా స్కూటీలు..!

యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. గూగుల్ చేసుకున్న ఒప్పందాలతో టెక్నాలజీ రంగంలో ఏపీ దూసుకుపోతుందని లోకేశ్ చెప్పారు. యువతకు అంతర్జాతీయ స్థాయి స్కిల్స్ వస్తాయని, అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మినిస్టర్ లోకేశ్ అన్నారు.

Also Read: డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు: సీఎస్

గూగుల్ కీలక ఒప్పందాలు ఇవే

విద్య, నైపుణ్యాభివృద్ధి: విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10 వేల మందికి గూగుల్ ఎసెన్షియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుంది. రోజువారీ జీవితంలో AIని ఎలా ఉపయోగించాలి, ఏఐ ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఈ కోర్సులో అంతర్భాగంగా ఉంటాయి. సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ జనరేటివ్ AI వంటి రంగాల్లో Google క్లౌడ్ సర్టిఫికేషన్‌లు, స్కిల్ బ్యాడ్జ్‌లను గూగుల్ అందజేస్తుంది.

స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎనేబుల్ మెంట్: ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం, మెంటర్‌షిప్, నెట్‌వర్కింగ్ అవకాశాలను అందించడం, స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ల కోసం Googleకి యాక్సెస్‌ని అందిస్తుంది. ఇందుకోసం Google సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో కలిసి పనిచేస్తుంది. దీంతోపాటు అర్హత కలిగిన AI స్టార్టప్‌లు క్లౌడ్ క్రెడిట్‌లు, సాంకేతిక శిక్షణ వ్యాపార మద్దతును పొందుతాయి.

సుస్థిరత: గాలి నాణ్యత, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో గూగుల్ ఏఐ ఆధారిత సహకారం, సేవలను అందిస్తుంది.

హెల్త్‌కేర్: నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపర్చడం, రోగి ఆరోగ్య ఫలితాలను వేగవంతం చేయడంలో ఏఐ సేవల వినియోగానికి సహకారం అందించడం, హెల్త్ AI ఇమేజింగ్ మోడల్‌లకు యాక్సెస్ అందించడం, LLMలు ద్వారా హెల్త్‌కేర్‌ ఉత్పాదకరంలో AI అప్లికేషన్‌లను అన్వేషించడం, హెల్త్ AI డెవలపర్ ఫౌండేషన్స్ (HAI-DEF) ద్వారా పరిశోధన కార్యక్రమాలకు గూగుల్ మద్దతు ఇస్తుంది.

AI పైలట్‌లు: వ్యవసాయం, ట్రాఫిక్ నిర్వహణ, వెబ్‌సైట్ ఆధునీకరణ, పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలలో క్లౌడ్ టెక్నాలజీ, AI ప్రయోజనాలపై కీలక రంగాలలో పైలట్ ప్రాజెక్ట్‌లకు Google సహకరిస్తుంది.

Also Read: మీది ప్రజాపాలన కాదు.. రాక్షసపాలన.. కౌశిక్‌రెడ్డి ఇష్యుపై హరీష్‌రావు ఆగ్రహం

Also Read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్‌ కంపెనీ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు