TTD: శ్రీవారి ఆలయంలో మరో అపచారం.. మండిపడుతున్న భక్తులు!

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువైన చోట పదే పదే అపచారం జరుగుతుంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గురువారం ఒక్కరోజే ఆలయం మీదుగా 8 విమానాలు వెళ్లడం గమనార్హం.

New Update
TTD: తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ..సర్వ దర్శనం నిలిపివేత!

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువైన చోట పదే పదే అపచారం జరుగుతుంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 

Also Read: Madhya Pradesh: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన

తిరుమల శ్రీవారి ఆలయం పై విమానాల రాకపోకలు ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువైపోయాయి. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ప్రతిరోజు శ్రీవారి ఆలయం మీద నుంచి విమానాలు వెళ్తుండడం పట్ల భక్తుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌ గా ప్రకటించాలనే డిమాండ్‌ కొత్తేం కాదు.గురువారం ఒక్కరోజే ఆలయం మీదుగా 8 విమానాలు వెళ్లడం గమనార్హం.

Also Read: ప్రియుడి చేతిలో మోసపోయిన కూతురు.. పోలీసులు న్యాయం చేయలేదని తల్లి ఆత్మహత్య!

ఈ అంశం పై కేంద్రానికి పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం , ప్రభుత్వాలు లేఖలు రాసినా స్పందన లేకుండా పోయింది.తిరుపతిలో విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చంటూ కేంద్రం అప్పట్లో వివరణ ఇచ్చుకుంది.గతంలో టీడీపీ తరుఫున అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది.కానీ అప్పుడు అడుగులు ముందుకు సాగలేదు.

ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయో కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో పాటు రాష్ట్రానికి చెందిన రామ్మోహన్‌ నాయుడు విమానాయాన శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సానుకూల స్పందన రావొచ్చని భక్తులు అనుకున్నారు.కానీ అది జరగడం లేదు. తాజాగా విమానాయాన శాఖ మంత్రికి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఓ లేఖ రాశారు. తిరుమల పై విమాన రాకపోకలు నిషేధించాలని లేఖలో కోరారు. 

ఈ లేఖకు మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. తిరుమలకు నో ఫ్లయింగ్‌ జోన్‌ ఇవ్వడం సాధ్యం కాదని, అలాంటి హోదా ఇవ్వడానికి నిబంధనలు లేవని పేర్కొన్నారు. పైగా దేశంలో ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి ఇలాంటి వినతులు వస్తున్నాయని చెప్పారు.అయితే తిరుమల గగనతలం పైకి విమానాలు రాకుండా,ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ,నావిగేషన్‌ విభాగాలతో చర్చించి చర్యలు తీసుకుంటాం అని మాత్రం హామీ ఇచ్చారు.

ఆ హామీ ఇచ్చినప్పటికీ ..ఇప్పుడు మళ్లీ విమానాలు తిరుగుతున్నాయి. ఇంతటి అపచారం జరుగుతున్నా..తిరుమలను ఫ్లయింగ్‌జోన్‌ గానే కొనసాగిస్తారా? అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దేవాలయాలపైన ఎవరూ సంచరించకూడదని అగమశాస్త్రం చెబుతోంది.ఆలయాలు ఉన్నత ప్రాంతాలు.భగవంతుడి కంటే ఎత్తులో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు.దైవానికి నివేదన చేసేటప్పుడు ..గంటానాదం,ఢమరుకం,వాయిద్యాలు తప్పించి..మరేయితర శబ్దాలు వినిపించకూడదు .అలా జరిగితే అది అపచారం.

కావున అగమశాస్త్రం ప్రకారం విమానాలు,రాకెట్లు ఆలయం మీదుగా వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు.

Also Read: Road Accident: అన్నమయ్య జిల్లాలో లారీలు నుజ్జు నుజ్జు.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం

Also Read:America: విమానంలో చెలరేగిన మంటలు..ప్రయాణికులు రెక్కలపై నిల్చుని!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి!

లైగింక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.దీపక్‌ అనే వ్యక్తి వేధించడం వల్లే తాను చనిపోతున్నట్లు నాగాంజలి సూసైడ్‌ నోట్‌ రాసింది.

New Update
suicide

suicide

కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న ఫార్మాసిస్ట్.. శుక్రవారం తుది శ్వాస విడిచింది. నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వల్ల పార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, దుర్గారావులు కోరుతున్నారు.

Also Read: Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్..  !

అసలేం జరిగిందంటే...

కాగా.. గత నెల 23న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వికాస్‌ ఫార్మసీ కళాశాల ఫార్మ్‌ డి ఫైనలియర్‌ విద్యార్థిని నాగాంజలి (23) ఆత్మహత్యాయత్నం తీవ్ర సంచలనం రేపింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మం డలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నాగాంజలి రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి వద్ద వికాస్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్‌ డి పైనలియర్‌ చదువుతోంది. అయితే గత నెలలో నాగాంజలి ఆస్పత్రిలోనే ఎనస్థీషియా అత్యధిక డోస్‌ ఇంజక్షన్‌ తీసుకుంది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే గమనించిన సహచరులు ఐసీయూలోకి తరలించి చికిత్స అందజేశారు. ఈ క్రమంలో నాగాంజలి డైరీలో రాసుకున్న సూసైడ్ లెటర్ బయటకు రావడంతో తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థినిలు రాజమహేంద్రవరంలో ఆందోళనకు దిగారు.

Also Read: Gujarat: వారం క్రితమే నిశ్చితార్థం...ఇంతలోనే ప్రమాదం..కన్నీళ్లు పెట్టిస్తున్న గుజరాత్‌ జెట్‌ పైలెట్‌ మృతి!

ఆసుపత్రిలో మెడికల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న దీపక్‌ వేదింపుల వల్లే నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు సూసైడ్ నోట్‌లో రాసింది. అంతే కాకుండా సూసైడ్ నోట్‌లో దీపక్‌ వల్ల తాను అనుభవించిన బాధలను వివరించింది. ఓ ఫంక్షన్‌కు రెడ్ శారీ కట్టుకుని వెళ్లడంతో వాడి కళ్లలో పడ్డానని.. తనను మోసం చేశాడని, తనకు మరణం తప్ప వేరే దారి లేదని, తన గురించి బెంగపెట్టుకోవద్దని, తాను మరణించాక అవయవాలు దానం చేయాలి అంటూ ఫార్మాసిస్ట్ సూసైడ్‌ నోట్‌ రాసిమరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దీపక్‌ ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నాగాంజలి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!

Also Read:  Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

 student | suicide | rajamahendravaram | east-godavari | westgodavari | crime | ap | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment