Vijayawada Firing Incident : విజయవాడలో కాల్పుల కలకలం..తుపాకీతో పోలీసులపైకి ...

విజయవాడలో పోలీసులు కార్టన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్‌ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు.

New Update
FotoJet (36)

Gun firing

Vijayawada Firing Incident : విజయవాడలో పోలీసులు(police) కార్టన్‌ సెర్చ్‌(Carton search) నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు(gun firing incident) జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. స్థానిక బస్టాండ్‌ సమీపంలో ఉన్న బాలాజీ హోటల్‌లో శనివారం పోలీసులు, ఈగల్‌ టీం అధికారులు తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో  పోలీసులు, ఈగల్‌ టీమ్‌ అధికారులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. దీంతో  అప్రమత్తమైన అధికారులు అనంతరం పారిపోతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.  నిందుతుడిని తెలంగాణలోని వరంగల్‌కు చెందిన మురళిగా గుర్తించారు. ట్రిగ్గర్‌ ప్రెస్‌ చేయకపోవడంతో బుల్లెట్‌ ఛాంబర్‌లోకి రాలేదని పోలీసులు తెలిపారు.

Also Read :  ఇవేం ఎండలు బాబోయ్.. ఇక బతికి బయటపడటం కష్టమే!

Firing Incident In Vijayawada

నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్‌ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు. దీంతో పోలీసులు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. తుపాకీ పేలకపోవడంతో నిందితుడి అక్కడినుంచి పారిపోవడానికి పరుగెత్తడంతో పోలీసులు, ఈగల్ అధికారులు ప్రాణాలకు తెగించి అతడిని వెంటాడి పట్టుకున్నారు. కాగా అతన్ని తెలంగాణలోని వరంగల్‌ జిల్లా నెల్లికుదురు  గ్రామానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి 9 MM పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 అసలు ఆ వ్యక్తి విజయవాడకు ఎందుకు వచ్చాడు?, గన్ ఎలా వచ్చింది..?, ఎవరినైనా హతమార్చేందుకు అతడు కుట్ర పన్నాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశంలో, అది కూడా రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అయితే అతనికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? అతను విజయవాడకు ఎందుకు వచ్చాడు. ఎవరినైనా టార్గెట్‌ చేసి చంపడానికి వచ్చాడా? నిందితునికి నేరప్రవృత్తి ఏమన్నా ఉందా అనే కోణంలో విచారణ చేయడానికి అతన్ని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. కాగా అందులోనూ బహిరంగ ప్రదేశంలో రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఇలా జరగడం సంచలనంగా మారింది. ఒక వేళ తుపాకీ పేలితే ఎలాంటి నష్టం వాటిల్లేది అని ప్రజలుతీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Also Read :  హోం మంత్రి అనితకు అస్వస్థత: ఆస్పత్రికి తరలింపు

Advertisment
తాజా కథనాలు