/rtv/media/media_files/2025/03/05/QrMjmDTkEqOoaP5x4TNW.jpg)
Father kills daughter in Guntakallu Anantapur district
Ap Crime News: నేటి ఆధునిక యుగం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోంది. భూమి నుంచి ఆకాశానికి చేరుకునేంత టెక్నాలజీని మానవుడు అభివృద్ధి చేశాడు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మనిషి వెనుకబడే ఉన్నాడు. అదే కులం. అవును ఇప్పటికీ కొందరు ఈ కులం ముసుగులోనే ఉండిపోతున్నారు. కులం కూడుపెట్టదని అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఆచరించేదే ఆచారం, పాటించేదే సంప్రదాయం, మానవత్వమే మన మతం, కులం అనేది తెలుసుకోలేకపోతున్నారు.
Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?
ఈ క్రమంలో పరువు కోసం ప్రాణాలనే తీస్తున్నారు. తన మన తేడా లేకుండా హత్యలకు పాల్పడుతున్నారు. గుండెలపై అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నపేగును సైతం తెగనరుకుతున్నారు. ఇప్పటికి ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. తాజాగా మరొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రేమించాను.. ప్రేమ వివాహం చేసుకుంటాను అని చెప్పిన కూతురుని ఓ తండ్రి అతి కిరాతకంగా ఉరేసి, పెట్రోల్ పోసి తగులబెట్టి చంపాడు. ఆపై పోలీసులకు లొంగిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ముగ్గురు కూతుళ్లకు పెళ్లి
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు. అందులో ముగ్గురు కుమార్తెలకు ఆ తండ్రి వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. ఇక చివరి కూతురు మిగిలి ఉంది. ఆమె బీటెక్ చదువుతోంది. ఇక అందరికంటే చిన్న కుమార్తె కావడంతో ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు.
Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
ప్రేమ వివాహం చేసుకుంటా
ఒక మంచి సంబంధం తెచ్చి తన అక్కలకు చేసినట్లుగానే అంగరంగ వైభవంగ పెళ్లి చేయాలని తల్లిదండ్రి అనుకున్నారు. అక్కడితో తమ రుణం తీరిపోతుందని భావించారు. ఇదే విషయాన్ని తండ్రి తన కుమార్తెకు చెప్పాడు. అయితే ఆ యువతి మాత్రం.. తాను వేరే అబ్బాయిని ప్రేమించానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే వేరొక కులం యువకుడినని తన కూతురు ప్రేమించడంతో తండ్రికి నచ్చలేదు.
Also Read : అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
ఉరేసి, పెట్రోల్ పోసి
దీంతో పలుమార్లు నచ్చజెప్పాడు. కానీ అప్పటికీ ఆ యువతి వినిపించుకోలేదు. దీంతో కూతురిపై పీకల్లోతు కోపం తెచ్చుకున్నాడు. కూతురి ప్రేమ విషయం బయట ఎవరికైనా తెలిస్తే తమ కుటుంబ పరువు పోతుందేమోననే భయంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ తరుణంలోనే కసాపురం శివార్లలోని తిక్కస్వామి ఆలయం వద్దకు తన కూతురిని తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను ఉరివేసి హత్య చేశాడు. అక్కడితో అతడి కోపం చల్లారలేదు. వెంటనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తన కూతురిని తానే హత్య చేశానని వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.