ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: HDFC బ్యాంకు డబ్బు చోరీ చేసిన ఉద్యోగి.. చివరికి ఏపీలోని రాజమండ్రిలో HDFC బ్యాంకు ఏటీఎంలకు క్యాష్ ఫిల్లింగ్ చేసే ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్న అశోక్ కుమార్ అనే ఉద్యోగి రూ.రెండున్నర కోట్లతో పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నారు. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పిఠాపురంలో IAS కృష్ణతేజ పర్యటన.. పంచాయతీ సమస్యలపై ఫోకస్..! పిఠాపురంలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ పర్యటించారు. పంచాయతీల్లో సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని చందుర్తి గ్రామస్తులు కృష్ణతేజకు ఫిర్యాదు చేశారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్ AP: గత ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీ శాఖలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు డిప్యూటీ సీఎం పవన్. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు నిలిపివేసిందని చెప్పారు. గతంలో జరిగిన తప్పులన్నింటిపై శ్వేతపత్రం ఇచ్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : కర్రలతో కొట్టుకున్న అన్నదమ్ములు.. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని.. కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇంటి సరిహద్దు విషయంలో అన్నయ్య పూవ్వల రామకృష్ణ, తమ్ముడు సత్యనారాయణ ఒకరిపై ఒకరు కర్రలతో, ఇటుకులతో దాడులు చేసుకున్నారు. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని కొట్లాడుకున్నారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డిప్యూటీ సీఎంను కలిసిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్ వి. సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్ధ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇంకా ఏనాళ్లు వరదలకు ఇబ్బంది పడాలి.. బాధితుల ఆవేదన..! అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం వచ్చే వరదలకు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కనీసం వచ్చే ఏడాదికైనా తమకు పునరావాసానికి ఇళ్ళు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆసుపత్రిలో కూలిన పైకప్పు.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..! కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో పైకప్పు కూలింది. దీంతో రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాత భవనం కావడంతో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల పైకప్పు పెచ్చు ఊడిపడిందన్నారు ఆసుపత్రి సూపరిండెంట్ స్వప్న. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మరో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..! కాకినాడలో అదృశ్యమైన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి కాండ్రేగుల రాధాకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యానాం బ్రిడ్జిపై రాధాకృష్ణ చెప్పులు, సెల్ ఫోన్ గుర్తించారు. తన తండ్రి ఆత్మహత్యకు మహిళా ఉద్యోగినే కారణమని కుమారుడు నిఖిల్‌సాయి ఆరోపించారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Boat: సముద్రంలో పడవ బోల్తా.. ఆరుగురు మత్సకారులు! ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వస్తున్న మత్సకారుల పడవ సముద్రంలో బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి సముద్రంలో బోటు ఆగిపోయింది. ఆ సమయంలోనే పెద్ద అలల తాకిడికి బోటు ఒక్కసారిగా తిరగబడింది. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn