AP: తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు..జన్మస్థలమంటూ..

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్‌. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆంధ్రా గడ్డ మీద నినాదాలు చేశారు. కొండగట్టు ఆంజనేయుడి దయవల్లే తాను బతికానని గుర్తు చేసుకున్నారు. అలాగే దివంగ గద్దర్ ను కూడా తలుచుకున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
ap

Pawan Kalyan

జనసేన 12 ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన స్పీచ్ తో అదరగొట్టారు. ఇందులో పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. 2014లో అన్ని ఒక్కడినై పార్టీని స్థాపించానని చెప్పారు. తనకు భయం అంటే ఏంటో తెలియదని, గుండె ధైర్యమే తన కవచం అన్నారు. భయం లేదు కాబట్టే 2019లో బరిలోకి దిగానని తెలిపారు. మనం నిలబడ్డాం నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్‌ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగు పెట్టాం. దేశమంతా మన వైపు చూసేలా 100 శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించాం' అని చెప్పారు పవన్.  

తెలంగాణ నినాదాలు...

ఈ ప్రసంగంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణను కూడా తలుచుకున్నారు.  నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెబుతూ..జనసేనకు జన్మస్థ్ తెలంగాణ అయితే కర్మస్థలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నారు. తాను కరెంట్‌ షాక్‌ కొట్టి చావుబతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడని గుర్తు చేసుకున్నారు పవన్. దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యా. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తాం.. అనే మాటలు నిజం చేశాం. బహు భాషలే భారతదేశానికి మంచిది. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని స్పీచ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. 

గద్దర్ ప్రోత్సాహించారు..

చాలా ఇబ్బందులు పడి 11 ఏళ్ళు పార్టీని నడిపించాను. నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఒక సాధనమే. ఖుషీ సినిమా చూసి గద్దరన్న తనను ప్రోత్సాహించారని..సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారని పవన్ చెప్పారు. తాను ఎలాంటి పొజిషన్ లో ఉన్నా సగటు మధ్య తరగతి మనిషిగానే బతకడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు నన్ను పెంచారు. అలాంటి నేను సినిమాలు చేస్తానని, రాజకీయాల్లోకి వస్తానని ఎవరూ ఊహించి ఉండరు. నేను డిగ్రీ పూర్తి చేసి ఎస్‌ఐను కావాలని మా నాన్న అనే వారు. బయటకు వెళ్తే ఏమవుతానో అని మా ఇంట్లో నిత్యం భయపడేవారు అని పవన్‌ అన్నారు.

Also Read: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

Advertisment
Advertisment
Advertisment