/rtv/media/media_files/2025/01/02/KE2CbBLC6AAp3Xl9cItp.jpeg)
Vehicle Checking Constable
Kakinada: కాకినాడ జిల్లాలో కొత్త సంవత్సరం వేళ వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ కారు ఇద్దరు కానిస్టేబుళ్లపై నుంచి దూసుకెళ్లిన ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. వారిద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో ఉన్నారు. జగ్గంపేట పోలీసులు మంగళవారం రాత్రి కిర్లంపూడి మండలం కృష్ణవరం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా దగ్గర వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు ఓ కారు వెళ్తుంది.
Also Read: Sunita Williams: ఒకే రోజు 16 సూర్యోదయాలు చూసిన సునీతా విలియమ్స్
సాధారణ తనిఖీల్లో భాగంగా ఆ కారును కూడా కానిస్టేబుళ్లు ఆపారు. ఆ కారును రోడ్డు పక్కకు ఆపుతున్నట్లు డ్రైవర్ నటించాడు.. కానీ కారును ఆపకుండా వేగంగా దూసుకొచ్చాడు. ఆ వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే తోటి సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Also Read: Team India Schedule 2025: వచ్చే ఏడాది టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
మరో కానిస్టేబుల్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత కారును రాజానగరం సమీపంలోని కెనాల్‌రోడ్డులో పోలీసులు గుర్తించారు . డ్రైవర్ కారును అక్కడ వదిలి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.. ఆ కారులో ఉన్న వారిని పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Lucknow Murder: నా తల్లి, 4గురు చెల్లెళ్లను అందుకే చంపేశా: వీడియో రిలీజ్ చేసిన కొడుకు!
ఆ కారులో గంజాయి
యూపీకి చెందిన ఆ కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ప్రకటించాల్సి ఉంది. అయితే కారు కానిస్టేబుల్స్‌పైకి దూసుకెళ్లిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.