BIG BREAKING: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ శుభవార్త చెప్పారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇక కర్నూల్ లో వైసీపీ నేతలపై దాడిని బైరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ రోజే ఇన్సిడెంట్ జరిగింది. పోలీసులు యాక్షన్ తీసుకుంటారని చూస్తున్నాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేస్తారని భావిస్తు్న్నాం. వారిని మందలించి వదిలేస్తే మాత్రం మేమేంటో చూపిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. వారు దోచుకున్న కబ్జాలు బయటపడకుండా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. ఇన్నా్ళ్లు వైసీపీలోనే ఉండి సొంత నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. మరోసారి జగన్ అన్న సీఎం అయితే అంతుచూస్తామంటూ హెచ్చరించారు.
🔴Live News Updates: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Ugadi 2025: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీని అర్థం ఏంటంటే.. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు జరుగుతాయని, ఆదాయం పుష్కలంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట.
Ugadi Sri Vishwavasu Photograph: (Ugadi Sri Vishwavasu)
హిందువులు తప్పకుండా జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి. ప్రత్యేకమైన ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంటిల్లా పాలిది కొత్త దుస్తులు ధరించి ఈ ఉగాది పండును నిర్వహిస్తారు. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగను ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కొత్త సంవత్సరం మార్చి 30వ తేదీన నిర్వహిస్తారు. అయితే తెలుగు క్యాలెండర్‌లో మొత్తం 60 సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతీ ఏడాది ఒక్కో కొత్త సంవత్సరం వస్తుంది. అయితే ఈసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వస్తోంది.
ప్రతీ కొత్త సంవత్సరానికి ఓ అర్థం ఉన్నట్లే.. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి కూడా ఓ అర్థం ఉంది. శ్రీ అనేది పవిత్రత, శుభత, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. విశ్వావసు అంటే ప్రపంచానికి శుభములు అందుతాయని అర్థం. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం శుభాన్ని, ఐశ్వర్యాన్ని అందించే సంవత్సరమని అర్థం. ఈ ఏడాదిలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా మందికి ఎక్కువగా శుభ ఫలితాలు వస్తాయి.
ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయని, చాలా మంది కుటుంబాల్లో సంతోషంగా ఉంటుందట. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం కూడా క్లోజ్ అవుతుందని పండితులు చెబుతున్నారు. క్రోధి నామ సంవత్సరం నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి వెళ్తున్నాం. క్రోధి అంటే కోపం. ఈ ఏడాది ప్రతీ ఒక్కరూ కూడా కోపంగా ఉండటం వంటివి జరిగాయి. కానీ కొత్త ఏడాదిలో అంతా కూడా మంచి జరుగుతుందని, అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
చెప్పులు ధరించి స్టార్ హీరోయిన్ గిరి ప్రదక్షిణ.. నెటిజన్లు ఫైర్
స్నేహ తన భర్తతో కలిసి అరుణాచలం వెళ్లింది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకుని చేసింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పవిత్రమైన అరుణాచల గిరి ప్రదక్షిణ చెప్పులతో చేయడం ఏంటని అంటున్నారు.
Mar 30, 2025 13:10 IST
Zomato: పండగపూట ఇదేం దరిద్రం.. ఫుడ్‌లో ఉమ్మి వేసిన డెలివరీ బాయ్.. వీడియో వైరల్!
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు. ముంబై హుమా కంజుమార్గ్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో ఉమ్మివేశాడు. స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో డెలివరీ బాయ్ పై చర్యలు తీసుకుంటామని జోమాటో యాజమాన్యం తెలిపింది.
mumbai Photograph: (mumbai)
Mar 30, 2025 07:52 IST
Ugadi Awards: త్రివిక్రమ్ సతీమణికి ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మక అవార్డు
ఏపీ ప్రభుత్వం 202 ఉగాది పురస్కారాలు ప్రకటించింది. విజయవాడలో ఉగాది సందర్భంగా CM చంద్రబాబు ఈ అవార్డులను ఇవ్వనున్నారు. 86 కళారత్న, 116 ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నారు. పృథ్వీరాజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయిసౌజన్యకు కళారత్న పురస్కారాలు లభించింది.
Soujanya Srinivas Photograph: (Soujanya Srinivas)
Mar 30, 2025 07:52 IST
తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక.. నేటి నుంచే సన్న బియ్యం పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఉగాది కానుకగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు.
CM Revanth
Mar 30, 2025 06:48 IST
Nubia Neo 3 5G: ఏంటి భయ్యా ఈ అరాచకం.. 12/256జీబీ కొత్త ఫోన్ ఇంత చీపా- వదలొద్దు మావా!
Nubia Neo 3 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. అందులో Neo 3 5G- 8/128GB ధర రూ.12,000గా, 8/256జీబీ ధర రూ.15000గా ఉంది. Nubia Neo 3 GT ఫోన్ 12/256జీబీ ధర రూ.19000గా ఉంది. వీటిని LAZADAలో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో వేడుకల్లో మునిగితేలుతారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..