/rtv/media/media_files/2026/02/18/fotojet-19-2026-02-18-12-09-55.jpg)
Body of a young man found in a pond
అన్నమయ్య జిల్లా(annamayya-dist) ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో ఓ యవకుడి మృతదేహం(sucide) తేలడం కలకలం రేపింది. మదనపల్లిలో ఏడేళ్ల బాలిక(7 years old girl) పై అత్యాచారం చేసి హత్యచేసిన కేసులో నిందితుడిగా ఉన్న కులవర్దన్ మృతదేహంగా పోలీసులు గుర్తించడంతో కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం చెరువులో మృతదేహం ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండటంతో ఆ యువకుడు చనిపోయి10 గంటలు దాటి ఉంటుందని పోలీసులు నుమానిస్తున్నారు. అయితే నిన్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు రావడం, అతన్ని తమకు అప్పగించాలని స్థానికులు ఆందోళనకు దిగడం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు వారికి సర్దిచెప్పి అతన్ని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం సాగింది. అలాంటిది అంతమంది పోలీసుల కళ్లుగప్పి నిందితులు ఎలా పారిపోయాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుడు పారిపోయే క్రమంలో చెరువులో పడి చనిపోయాడా? లేక ఇంకేదైనా జరిగిందా? దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read : మోహన్ బాబుకు బిగ్ షాక్.. రక్షణ కు నిరాకరించిన ఏపీ హైకోర్టు
అసలేం జరిగిందంటే?
స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె(madanapalle) పట్టణానికి చెందిన ఓ బాలిక (7) రెండో తరగతి చదువుకుంటోంది. శివరాత్రి సందర్భంగా సోమవారం బడికి సెలవు ఇవ్వడంతో ఇంటి దగ్గరే ఉంది. పాప తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్లారు. తల్లి సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి పాపలేదు. దీంతో ఆమె తండ్రికి ఫోన్ చేసి పాప ఇంట్లో లేదని తెలిపారు. స్నేహితులతో కలిసి ఆడుకోడానికి వెళ్లిందేమో అని అంతా భావించారు. అయితే రాత్రి అవుతున్నా ఎంతసేపటికీ పాప ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. అచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. స్థానికంగా వాట్సప్ గ్రూపుల్లో బాలిక ఆచూకీ తెలిస్తే చెప్పాలని పోస్టులు చేశారు..
Also Read : ‘కోవా బన్’ వలీకి అండగా నాగబాబు.. అదే దారిలో లోకేష్
అనుమానంతో..
కాగా బాలిక ఎదురింట్లో ఉంటున్న కులవర్ధన్ (30) అనే యువకుడు మద్యం, గంజాయికి అలవాటు పడి నేర చరిత్ర కలిగి ఉన్నాడని తెలిసి రాత్రి 1.30 గంటలకు పోలీసులు అతడి ఇంట్లో గాలించడానికి ప్రయత్నించారు. అయితే ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో కానిస్టేబుళ్లు కిటికీలోంచి తొంగి చూశారు. కులవర్ధన్ మద్యం మత్తులో పడుకుని కనిపించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాలిక చివరిసారిగా కుల వర్ధన్తోనే కనిపించిందని ఆమె తాత చెప్పడంతో మంగళవారం ఉదయం 7 గంటలకు మరోసారి అతని ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూశారు. అతని ఇంట్లో డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు. వెంటను నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు.
అయితే కనిపించకుండా పోయిన బాలిక ఎదురింట్లోనే శవమై తేలడంతో స్థానికంగా సంచలనం రేపింది. ఇంటి పక్కనే ఉన్న కులవర్ధన్ అనే యువకుడు చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అతికిరాతంగా అత్యాచారం చేసి హత్య చేసి నిర్ధారించారు. అనంతరం.. మృతదేహన్ని డ్రమ్ములో దాచినట్లు గుర్తించారు. చిన్నారి హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దఎత్తున మహిళలు, ప్రజలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిందితుడిని అప్పగించాలని, ఎన్కౌంటర్ చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు నచ్చజెప్పి.. తల్లిదండ్రులను ఒప్పించి సాయంత్రం సమయంలో బాలిక మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే బాలిక లైంగిక దాడికి కూడా గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. ఈ ఘటన తర్వాత పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చెరువులో లభించిన మృతదేహం నిందితుడిదే అని అక్కడి ప్రజలు, పోలీసులు నిర్ధారించారు.
Follow Us