Bill Gates: అమరావతికి బిల్‌గేట్స్‌.. సంజీవని, ఇతర సేవలపై ప్రశంసలు

గేట్స్‌ ఫౌండేషన్ ఛైర్మన్ బిగ్‌గేట్స్‌ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్‌ కమాండ్‌ సెంటర్ (RTGS)ను సందర్శించారు.

New Update
Bill Gates visited the Real Time Governance Society centre in Amaravati

Bill Gates visited the Real Time Governance Society centre in Amaravati

గేట్స్‌ ఫౌండేషన్ ఛైర్మన్ బిగ్‌గేట్స్‌ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్‌ కమాండ్‌ సెంటర్ (RTGS)ను సందర్శించారు. అక్కడ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరినుంచి పరిశీలించారు. RTGS అందిస్తున్న పౌర సేవల తీరు, వాటి ఫలితాల గురించి చంద్రబాబు బిల్‌గేట్స్‌కు వివరించారు. డేటాలేక్, వాట్సప్ గవర్నెన్స్, అవేర్ 2.0, రాజధాని అమరావతి ప్రాజెక్టు, అలాగే సంజీవని ప్రాజెక్టు గురించి తెలుసుకున్నారు.  

Also Read:  కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బిగ్‌ట్విస్ట్‌.. బీజేపీకే మేయర్‌ పీఠం

RTGSలోని డ్‌స్‌ప్లే గోడలపై ఉన్న ప్రజంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలను లింక్ చేశామని చంద్రబాబు చెప్పారు. అయితే డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్‌తో పౌర సేవలను సులభతరం చేయడాన్ని బిల్‌గేట్స్‌ మెచ్చుకున్నారు. అవేర్ 2.0తో రియల్ టైమ్‌లో సమాచారాన్ని తీసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చంద్రబాబు ఆయనకు వివరించారు.ప్రస్తుతం ఏపీ సర్కార్‌ అమలు చేస్తున్న స్కీమ్‌లు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం తీసుకుంటున్న తీరును కూడా బిల్‌గేట్స్ పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ ద్వారా GSDP పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 

Also Read: ‘కోవా బన్‌’ వలీకి అండగా నాగబాబు..అదే దారిలో లోకేష్‌

అయితే ప్రాపర్టీ రికార్డుల సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి జాగ్రతల్లు తీసుకుంటున్నారని బిగ్‌గేట్స్‌ అడిగారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని , అలాగే భూ రికార్డులపై క్యూఆర్‌ కోడ్‌ లాంటి విధానాల వల్ల పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు గేట్స్‌ ఫౌండేషన్ ద్వారా కొనసాగుతున్న చిత్తూరు జిల్లాలోని సంజీవని ప్రాజెక్టు గురించి కూడా బిల్‌గేట్స్‌ అడిగారు. బ్లడ్‌ ప్రెషర్, డయాబెటిస్ లాంటి పరీక్షల వివరాలు ఎలా రికార్డు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవి ప్రాజెక్టు చాలా బాగుందని బిల్‌గేట్స్ అన్నారు. ప్రజల డిజిటల్ ఆరోగ్య వివరాలను అనుసరించి వాళ్ల జీవనశైలి, ఆహారం ఇతర విషయాల్లో సలాహాలు, సూచనలు ఇస్తున్నామని అధికారులు చెప్పారు. 


 

Advertisment
తాజా కథనాలు