Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి ఊహించని షాకిచ్చిన పోలీసులు... 7 సెక్షన్ల కింద కేసులు

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్  నాలుగు రోజుల క్రితం తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. సత్యవర్ధన్ ను  బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వంశీపై కేసు నమోదయింది.

New Update
vamsi arrest

vamsi arrest

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఆయనను రాయదుర్గం పోలీసుల సహాయంతో  గురువారం ఉదయం అరెస్ట్‌ చేసిన  ఏపీ పోలీసులు..  గచ్చిబౌలి నుంచి ఔటర్‌ రింగురోడ్డు మీదుగా విజయవాడకు తీసుకువెళ్తున్నారు. కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆయన ఇంటికి  నోటీసులు  కూడా అంటించారు పోలీసులు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీని  పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ముందుగా అందరూ భావించారు.  అరెస్ట్ సమయంలో కూడా వంశీ తన బెయిల్ పిటిషన్ విచారణలో ఉందని ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ మరో కేసులో వంశీని అరెస్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు ఆయనకు చెప్పి అదుపులోకి తీసుకున్నారు.

Also Read :  భార్యతో గొడవలు..ప్రముఖ రాపర్‌ ఆత్మహత్య!

Also Read :  ఇక మీదట అమెజాన్లో కూడా పది నిమిషాల్లో డెలివరీ..

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి

2023  ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ ఆఫీసు (TDP Office) పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదురుకుంటున్నారు.  ఈ కేసులో ఆయన ఏ71గా ఉన్నారు.  అయితే ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్  నాలుగు రోజుల  క్రితం తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ ను  బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. సత్యవర్ధన్‌ను బెదిరించినట్లుగా సెల్‌ఫోన్‌ ఆడియో రికార్డులన్నీ పోలీసులకు దొరికాయి. తనను బెదిరించి కిడ్నాప్ పాల్పడ్డట్టుగా  సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు  వల్లభనేని వంశీ పై  ఎస్సీ, ఎస్టీ, బీఎన్ ఎస్ యాక్ట్ 140 (1), 308, 351 (3), రెడ్‌విత్ 3(5) కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు.  వంశీ అనుచరల  బెదిరింపు వల్లే కోర్టులో తాను పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసులకు తెలిపారు సత్యవర్ధన్. దీంతో వంశీతో పాటుగా ఆయన ఐదుగురు అనుచరులుపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.  నేరం రుజువైతే వంశీకి 140(1) యాక్ట్‌ కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.  

Also read :   Bihar: తాగుబోతు భర్తతో విసిగిపోయి... లోన్ రికవరీ ఏజెంట్‌తో భార్య రెండో పెళ్లి.. చివరికి బిగ్ ట్విస్ట్!

Also Read :  లేడీ దొంగలు...  అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ నిలువు దోపిడీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు