JESSICA UPDATE : విశాఖ జెస్సికా మృతి కేసులో బిగ్‌ట్విస్ట్‌...స్నేహితుల దాడి..అవమానంతో సూసైడ్‌

స్నేహితులతో కలిసి బర్త్‌ డే వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన యువతి జెస్సికా మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్నేహితుల మధ్య జరిగిన గొడవలో స్నేహితులు ఆమెపై దాడి చేయడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

New Update
FotoJet (79)

Visakhapatnam Jessica's death case...

JESSICA UPDATE :  స్నేహితులతో కలిసి బర్త్‌ డే వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన యువతి జెస్సికా మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్నేహితుల మధ్య జరిగిన గొడవలో స్నేహితులు ఆమెపై దాడి చేయడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్నేహితుడి బర్త్‌ డే వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన జెస్సికా(27) (శాంతికుమారి) రాత్రి పదిన్నర సమయంలో తల్లికి కాల్‌ చేసి మరో అరగంటలో వస్తానని చెప్పింది. కానీ, ఉదయం వరకు రాకపోగా ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు స్నేహితులు పోన్‌ చేయగా ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యులకు ఆమె విగత జీవిగా దర్శనమిచ్చింది. అయితే మొదట ఆమెకు ఫిట్స్‌ రావడంతో ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన స్నేహితులు పోలీసుల ఎంక్వయిరీలో సంచలన విషయాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం -- విశాఖకు చెందిన సాయికిరణ్, జి.యశ్వంత్, లక్ష్మీ సౌజన్య,..-- నరవ సాయికుమార్, పుచ్చ సాయికిరణ్, మణి, జెస్సికా(శాంతి)  ఫ్రెండ్స్. వీరంతా ఈనెల 14న విశాలాక్షినగర్‌లోని బి-స్క్వేర్‌ లాడ్జిలో  బర్త్‌ డే పేరుతో 118, 119 నెంబరు గదులను అద్దెకు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ పార్టీ చేసుకున్నారు. అందులో భాగంగా మద్యం సేవించారు. ఆ సమయంలో వారి మధ్య మాట మాట పెరిగింది. శాంతికుమారి తనకు మరొకరితో సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేస్తోందని సాయికిరణ్‌ ఆమెను నిలదీశాడు. దీన్ని శాంతికుమారి తనకు ఏం తెలియదని ఖండించినప్పటికీ ఆగ్రహానికి లోనైన సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, యశ్వంత్‌ ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక శాంతికుమారికి ఫిట్స్‌ వచ్చాయి. దీంతో బయపడ్డ స్నేహితులు ఆమెకు నీళ్లు తాగించి ఆ తర్వాత 118 గదిలో ఆమెను పంపినట్లు తెలుస్తోంది. అయితే స్నేహితుల దాడితో తీవ్ర మనస్థాపానికి గురైన శాంతి అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత కొంత సేపటికి వెళ్లి తలుపు కొట్టగా ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించింది. వెంటనే వారు ఆమెను కిందకు దింపి వెంకోజీపాలెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసుల విచారణలో తేలింది.

అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను స్నేహితులు కొట్టడం వల్లే చనిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. జెస్సికాను పక్కా ప్లాన్‌తోనే చంపేశారని ఫ్యామిలీ ఆరోపిస్తుంది.అందుకే సీసీ కెమెరాల డైరెక్షన్ మార్చారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి కోసం 118నంబర్‌ రూం బుక్ చేశారని హోటల్ యాజమాన్యం చెబుతోంది. అమ్మాయి, అబ్బాయిలకు ఒకే రూం ఇవ్వడం కుదరదని సిబ్బంది ముందే చెప్పారని, జెస్సికానే తన ఆధార్‌ కార్డుతో రూం బుక్ చేసినట్లు చెప్పిన హోటల్ యాజమాన్యం స్పష్టం చేస్తోంది.  కూతురు మరణంపై తల్లి అరిలోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు  జెస్సికా స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా విచారణలో కీలక విషయాలు చెప్పారు. దాడి తర్వాత జెస్సికాకు ఫిట్స్‌ వచ్చిందని ఆతర్వాత 118రూమ్‌లోకి వెళ్లిన తలుపులు వెసుకుందని వెల్లడి అక్కడే ఆత్మహత్య చేసుకుందని వెల్లడి. కాగా ఈ మరణంపై పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించడం (అబౌట్మెంట్‌ సూసైడ్‌) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు