/rtv/media/media_files/2025/03/04/rB8nu6NTxkT8FXm6Jqz5.jpg)
Posani Krishna Murali
టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) కి ఊహించని షాక్ ఎదురైంది. జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, నారా లోకేశ్ ల గురించి అసభ్యంగా పోస్టు పెట్టారంటూ పోసాని కృష్ణ మురళిపై ఐదు నెలల క్రితం గుంటూరు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు . అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈ రోజు పోసానిని విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచే ప్రచారం జరిగింది.
Also Read: Ap Weather:ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!
ఈ తరుణంలోనే... జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా సీఐడీ అధికారులు గుంటూరు కోర్టులో పోసానిపై పీటీ వారెంట్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన పీటీ వారెంట్‌ను అనుమతించింది కోర్టు. దీంతో దీనిపై ఇవాళ విచారణ జరుగనుంది. కర్నూలు జైలు నుంచే ఆన్ లైన్ లో జడ్జి ఎదుట పోసాని కృష్ణ మురళిని హజరుపర్చనున్నారు ఏపీ సీఐడీ అధికారులు.
Also Read: PAK: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
No Bail To Posani
ఈ మేరకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ కోర్టు విచారణ నేపథ్యంలో... పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే.. దీనిపై వైసీపీ నేతలు, పోసాని కృష్ణ మురళి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే... పోసాని కృష్ణ మురళి ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.
కాగా, ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసాని కృష్ణ మురళికి నిన్న బెయిల్ మంజూరు అయింది. ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో పోసానికి బెయిల్ మంజూరు అయ్యింది. మిగతా కేసుల్లో BNS చట్టం 353 సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని కృష్ణమురళి. అన్ని కేసుల్లో రిలీఫ్ రావటంతో ఇవాళ విడుదల అవుతారనే సమయానికి సీఐడీ అధికారులు (CID Officials) పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
Also Read: Trudeau:కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్!