/rtv/media/media_files/2025/03/21/MCWdC3Imeer38SxyHgyc.jpg)
Big fraud in Nandyal district
Big fraud : నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం బయటపడింది. బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సీఈవో వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడని సెక్రటరీ పద్మావతి ఆరోపిస్తున్నారు. కాగా ఈ బ్యాంక్ మహిళలకు అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం రుణాలు ఇస్తామని డిపాజిట్లు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. నంద్యాల జిల్లాలో 5 బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి వేలాది మంది మహిళల నుండి సుమారు రూ. 2 కోట్ల మేరకు భారీ మొత్తం లో డిపాజిట్లు సేకరించి నట్లు సమాచారం. సీఈవో వెంకట రమణ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించిన సెక్రటరీ పద్మావతి.
Also Read : వారేవా పాకిస్థాన్.. న్యూజిలాండ్కు చుక్కలు చూపించింది!
సీఈవో గా ఉన్న వెంకటరమణ గత 20 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతం లోకి వెళ్లడంతో డిపాజిట్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం లో రుణాలు ఇస్తామని డిపాజిట్లు సేకరించినట్లు వెంకటరమణ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లా చెందిన ఏవి వెంకట రమణ అనే వ్యక్తి జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యం లో గత 2021 అక్టోబర్ 8 న కోవెలకుంట్ల లో జననీ సహాయ సహకార పరపతి పొదుపు సంఘం పేరుతో, అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేత మహిళా బ్యాంకును ప్రారంభించాడు. కోవెలకుంట్ల లో బ్రాంచి ఏర్పాటు చేసిన అనంతరం నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, చాగలమర్రి లో మరో నాలుగు బ్రాంచి ఆఫీసులను సీఈవో వెంకట రమణ ఓపెనింగ్ చేపించాడు,
Also Read : బాగా ఫీల్ అయినట్టున్నాడు... పెళ్లికి పిలువలేదని కాల్చి పారేశాడు!
స్థానిక పొదుపు మహిళా బ్యాంకు లో మహిళలకు నమ్మకం కలిగించే విధంగా బ్యాంకు గ్రూపు కమిటీకి 15 మంది మహిళలను నియమించి అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం రుణాలు ఇస్తామని వేలాది మంది మహిళల నుండి దాదాపు 2 కోట్ల మేరకు భారీ మొత్తం లో డిపాజిట్లు సేకరించినట్లు సమాచారం. కోవెలకుంట్ల మహిళ పొదుపు బ్యాంకు సెక్రెటరీగా ఉన్న పద్మావతి అనే మహిళ సహకారం తోనే సీఈవో వెంకట రమణ భారీ ఎత్తున డిపాజిట్స్ సేకరించి సొమ్ము చేసుకొని అజ్ఞాతం లోనికి వెళ్లినట్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా సీఈవో వెంకటరమణ, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి,అజ్ఞాతంలోకి వెళ్లడం తో పొదుపు మహిళా బ్యాంకు గ్రూపు కమిటీ సెక్రెటరీగా ఉన్న పద్మావతి తో పాటు, సభ్యులు, సిబ్బంది లబోదిబమంటూ మొత్తుకుంటున్నారు.
Also read : ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు!
డిపాజిటర్లకు డబ్బులు చెల్లించ కుండా పారిపోయిన సీఈవో వెంకటరమణ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కడపకు చెందిన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ, నిర్వాహకుడు వెంకట రమణ,2009 లో కోవెలకుంట్ల లో డ్వాక్రా పొదుపు గ్రూప్ సంఘాల కోఆర్డినేటర్ గా పనిచేయడం జరిగిందన్నారు, ప్రస్తుతం కోవెలకుంట్ల జననీ సహాయక సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు డిపాజిటర్ల పరిస్థితి ప్రశ్నార్ధకం గా మారింది,జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ నిర్వాకం పై పోలీసులు దృష్టి సారించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి నట్లయితే, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.