BIG BREAKING: గ్రూప్‌ 2 'ఇనిషియల్‌ కీ' విడుదల.. ఇదిగో లింక్‌

ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్‌ ' ఇనిషియల్ కీ' ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది.  https://portal-psc.ap.gov.in/  వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అభ్యర్థులకు ఏమైన ప్రశ్నలు, సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్‌ ద్వారా ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు ఫిర్యాదు చేయొచ్చు.

New Update
APPSC Group 2 Initial Key Released

APPSC Group 2 Initial Key Released

ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్‌ ' ఇనిషియల్ కీ' ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది.  https://portal-psc.ap.gov.in/  వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అభ్యర్థులకు 'కీ' పై ఏమైన ప్రశ్నలు, సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్‌లో ఫిర్యాదులు చేయవచ్చు. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశం ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.  

Also Read: మైనర్‌ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఇదిలాఉండగా ఆదివారం ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్‌ తొలి పేపర్‌ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్‌ నిర్వహించారు. 92,250 మంది మెయిన్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా.. ఇందులో 92శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. పలు పరీక్ష కేంద్రాల్లో కొందరు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వాళ్లని పోలీసులు, అధికారులు వెనక్కి పంపించేశారు.  

Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!

ఇదిలాఉండగా.. మొత్తం 905 పోస్టులకు గాను గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఒక్కో పోస్టుకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌ ఎంపికయ్యారు. మెయిన్స్‌పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. 2023లో విడుదలైన గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రోస్టర్‌లో తప్పులున్నాయని అభ్యర్థులు మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. ఆదివారం జరగాల్సిన పరీక్షను కూడా వాయిదా వేయాలని గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. కానీ ఇందుకు సర్వీస్‌ కమిషన్‌ ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్ష వాయిదా వేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లవుతుందని సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. రాజకీయ నాయకులకు ప్రయోజనం చేకూర్చేలా పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీంతో యథావిథిగా ఆదివారం గ్రూప్-2 పరీక్ష జరిగింది. 

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Alekhya Chitti Pickles Issue: బలుపు ఎక్కువైంది.. అలేఖ్య చిట్టి పై యూట్యూబర్ అన్వేష్ షాకింగ్ వ్యాఖ్యలు!

అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీపై యూట్యూబర్ నా అన్వేష్ స్పందించాడు. ‘అలేఖ్య అలా తిట్టి ఉండకూడదు. వాళ్లు నా చెల్లెల్లాంటివారు. వారిని క్షమించండి. వారి కర్మబాగోలేక, బలుపు ఎక్కువై అలా చేసింది. త్వరలో లడ్డూ బిజినెస్ పెట్టబోతున్నారు’ అని చెప్పుకొచ్చాడు.

New Update
Naa Anveshana Reaction on Alekhya Chitti Pickles Controversy

Naa Anveshana Reaction on Alekhya Chitti Pickles Controversy

గత మూడు రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి ఆడియో రచ్చ రచ్చ చేస్తుంది. పచ్చళ్లు రేటు ఎక్కువగా ఉన్నాయని అడిగిన కస్టమర్లపై అలేఖ్య బూతులతో రెచ్చిపోయిన విధానం నెటిజన్లను చిర్రెత్తించింది. ప్రస్తుతం ఇదే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

నా అన్వేష్ షాకింగ్ రియాక్షన్ 

ప్రస్తుతం ఇదే కాంట్రవర్సీపై ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ స్పందించాడు. సుమ, అలేఖ్య, రమ్య తనకు చెల్లెల్లతో సమానమని అన్నాడు. అలేఖ్య బూతులపై తన తరఫున క్షమాపణలు చెబుతున్నాను అని పేర్కొన్నాడు. వాళ్లు యూట్యూబ్‌ ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడు తనను సంప్రదించారని తెలిపాడు. అందుకు తాను సలహాలు, సూచనలు కూడా ఇచ్చానని అన్నాడు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

అంతేకాకుండా వారు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారని సంచలన విషయాలు బయటపెట్టాడు. కానీ తాను వద్దని చెప్పగానే వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం ఆపేశారని అన్నాడు. అలేఖ్య బూతులు మాట్లాడకుండా ఉండాల్సింది. సోషల్ మీడియా ట్రోలింగ్స్‌తో అలేఖ్య అనారోగ్యానికి గురైందని అన్నాడు. ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో ఐసీయూలో ఉందని తెలిపాడు. అందువల్ల వారిని ఇకనుంచి వదిలేయండి అంటూ వేడుకున్నాడు. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

అంతేకాకుండా ఇప్పుడు పచ్చళ్ల బిజినెస్ పూర్తిగా బంద్ అయిందని.. త్వరలో లడ్డూల బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అలేఖ్య చెల్లి రమ్య త్వరలో పూతరేకులు, స్వీట్స్, లడ్డూ వంటివాటితో కొత్త బిజినెస్ పెట్టబోతున్నారని తెలిపాడు. ఇదేదో రాష్ట్ర సమస్యలాగ తిడుతున్నారని.. ఈ వ్యవహారం ఏకంగా దేశాలు దాటిపోయిందని అన్నాడు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

బలుపు ఎక్కువై

ఫ్రస్టేషన్‌లో కస్టమర్లను తిట్టిందని.. వ్యాపారం చేయడం చేతకాక అలా చేసిందని అన్నాడు. బీపీ ఎక్కువై, కర్మబాగోలేక, ఇంకా చెప్పాలంటే బలుపు ఎక్కువై తిట్టేసిందని అన్నాడు. ఇప్పుడు అంతా అయిపోయింది. దుకాణాలన్నీ బంద్ అయిపోయాయి. అందువల్ల బీపీ, నోటుదూల ఉన్నోళ్లకు బిజినెస్ పనిచెయ్యదు అని చెప్పుకొచ్చాడు. దీంతో పాటు మరెన్నో షాకింగ్ విషయాలు తెలిపాడు.

(naa anveshana | latest-telugu-news | telugu-news | alekhyaa chitti pickle | alekhya chitti pickles controversy)

Advertisment
Advertisment
Advertisment