Ap :ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్‌...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!

ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.వాటిలో డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌, శ్వాససంబంధిత వంటి రోగాలు ఉన్నాయి.

New Update
AP

AP Government

ఏపీలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ నివేదికలో తెలిపింది. ఆసుపత్రుల్లో నమోదయ్యే కేసుల్లో బీపీ, షుగర్, గుండె జబ్బులు, జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. శ్వాసకోశ, అంటువ్యాధులు, కిడ్నీల సమస్యలు, క్యాన్సర్, హైపర్‌ టెన్షన్‌, మాతా శిశు ఆరోగ్య సమస్యలు ఇలా వ్యాధులు నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారి సమాచారంతో ఓ నివేదికను తయారు చేశారు. 18 ఏళ్ల వయసు దాటిన 2.15 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయించగా.. ఈ విషయాలు బయటపడ్డాయి.. ఇలా భారీగా అనారోగ్య సమస్యలు పెరగడానికి జీవన విధానంలో మార్పులే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల వారీగా హెల్త్ రిపోర్టులను వివరించారు.

Also Read: Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు!

కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో బీపీ, గుండె జబ్బుల కేసులు ఎక్కువగా ఉన్నాయని నివేదికలో తేలింది. అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో ఈ కేసులు తక్కువగా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. విశాఖ, విజయవాడ, వైఎస్సార్ కడప జిల్లాల్లో మానసిక వ్యాధులు, కుంగుబాటు, మద్యంతో ఆరోగ్యం దెబ్బతిన్న కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రోడ్డు ప్రమాదాల కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సర్వేలో బీపీతో బాధపడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. నేటి సమాజంలో  వస్తున్న మార్పులు, పని ఒత్తిడి, ఇతర కారణాలతో మహిళలు అత్యధిక సంఖ్యలో రక్తపోటుకు గురవుతున్నారని నివేదికలు వెల్లడించాయి. బీపీతో పాటు డయాబెటిస్‌తో బాధపడే వారిలో కూడా అత్యధికంగా మహిళలే ఉన్నారు.

AlsoRead: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

రాష్ట్రంలో కాలేయ సమస్యలతో బాధుపడుతున్నవారు నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి, శ్రీసత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు. శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో.. నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి, పశ్చిమగోదావరి, బాపట్ల జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు. నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు. విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి, శ్రీసత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారిలో శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో హైపర్‌ టెన్షన్‌, హార్ట్‌ స్ట్రోక్‌, గుండె సంబంధిత వ్యాధుల విషయంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి.

కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో జీవన విధానం వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వాయుకాలుష్యం, స్మోకింగ్‌ వంటి కారణాల వల్ల ఆస్తమా, నిమోనియో, సీవోడీపీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గశ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలో వాయుకాలుష్యం, స్మోకింగ్‌ వంటి కారణాల వల్ల ఆస్తమా, నిమోనియో, సీవోడీపీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌, తాగునీటి కాలుష్యంతో అనారోగ్యం బారినపడుతున్నవారు ఎక్కువగా ఉన్నారు. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో పొగాకు ఇతర అలవాట్ల కారణంగా సర్వైకల్‌, బ్రెస్ట్‌, ఓరల్‌ క్యాన్సర్‌ రోగులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అల్లూరి, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే చికెన్‌గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!

health | ap | ap health report | latest-news | telugu-news | ap-government | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment