/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pension-jpg.webp)
Ap: ఏపీ ప్రభుత్వం పింఛన్ల అంశం పై సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అనర్హుల ఏరివేత కోసం తనిఖీలు మొదలుపెట్టింది. మొన్నటి వరకు హెల్త్, మంచానికి పరిమితమైనవారి కోటాలో పింఛన్‌లు అందుకుంటున్న వారి పింఛన్‌లను తనిఖీ చేశారు. వీరితో పాటుగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేనివారిని గుర్తించే పనిలో పడింది. దివ్యాంగుల కేటగిరిలో అనర్హులు ఉన్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో వీటిని తనిఖీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారు సంఘంలో కీర్తి ప్రతిష్ఠ పొందుతారు..అంతే కాకుండా..
ఈ మేరకు అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఈ దివ్యాంగ కేటగిరీలో పింఛన్‌లను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం యంత్రాంగం పరిశీలించబోతుంది. దివ్యాంగ కేటగిరిలో పింఛన్‌లను అందుకుంటున్నవారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు సిబ్బంది రోజుకు 200 మందికి చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. దివ్యాంగ కేటగిరీలో పింఛన్‌లు అందుకుంటున్నవారిని.. నాలుగు కేటగిరీల్లో ఎవరెవరు ఏ తేదీల్లో ఈ పరీక్షలకు హాజరుకావాలో ముందుగానే సమాచారం అందజేస్తున్నారు.
Also Read: Donald Trump: ట్రంప్ ప్రమాణ స్వీకారం నేడే..వాషింగ్టన్ చేరుకున్న కొత్త అధ్యక్షుడు
ఏదైనా తేడా వస్తే..
అయితే ఈ నెల 22 నుంచి 30 వరకు పీజీ వైద్య విద్యార్థులు పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి ఈ పింఛన్‌దారుల పరిశీలనను చేపట్టనున్నారు. పింఛన్ తీసుకునేవారు కచ్చితంగా పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వెళ్లకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ఎవరూ ఈ తప్పు చేయొద్దంటున్నారు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పింఛన్ నిలిపివేస్తారు.ఈ తనిఖీలు చేయనున్న టీమ్‌లో.. జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, ఆఫ్తమాలజిస్ట్‌లు ఉంటారు. అలాగే నలుగురు సహాయక వైద్యులు కూడా ఈ పింఛన్ల పరిశీలనలో పాల్గొంటారు.
ఈ డాక్టర్లు ఇచ్చే నివేదికలపై రెండు ఆసుపత్రుల పర్యవేక్షకులు, ఆర్‌ఎంవో, విధుల్లో ఉన్న వైద్యులు కచ్చితంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. పింఛన్ల అనర్హుల ఏరివేత కోసం వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గుండె జబ్బులు, పక్షవాతం, డయాలసిస్ చేయించుకుంటున్నవారు, తలసేమియా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభుత్వం నెలకు రూ.15వేలు పింఛన్ అందజేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులు ఈ కేటగిరీలో పింఛన్‌లు తీసుకుంటున్నారనే ఆరోపణలతో వైద్య నిపుణులు లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి.. ఈ పింఛన్‌లను పరిశీలించి నివేదికలు రూపొందించారు.ఇక దివ్యాంగుల కేటగిరీలో పింఛన్‌ల తనిఖీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీలు పూర్తయిన తరువాత మళ్లీ ర్యాండమ్‌గా పునః పరిశీలన చేసేందుకు మరో వైద్య బృందాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Also Read: BIG BREAKING: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణ భయంతో భక్తుల పరుగులు!