/rtv/media/media_files/2025/01/18/W4r8e1dVGSxlaZ4XaX4g.jpg)
sunil
Ap: సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఏపీ సర్కార్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సునీల్ కుమార్‌పై వచ్చిన అభియోగాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను సభ్యులుగా నియమించారు.
నకిలీ ఖాతాలకు రూ.75 లక్షలు...
సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వుల్లో తెలియజేశారు.మరోవైపు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏసీబీ డీజీకి లేఖ రాశారు. ప్రైవేట్ టెక్నాలజీస్ కాంట్రాక్ట్ నిధుల మళ్లింపులో సునీల్ కుమార్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. నకిలీ ఖాతాలకు రూ.75 లక్షలు మళ్లించారని రఘురామ ఆరోపిస్తూ ఏసీబీ డీజీకి లేఖ రాశారు.
Also Read: IMLT20: క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. టీమిండియా కెప్టెన్‌గా లెజెండరీ క్రికెటర్
మిగతా డబ్బు ఇవ్వాలని సునీల్ కుమార్ బెదిరించినట్లు రఘురామ పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ కేసులో సునీల్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డారని.. రఘురామ లేఖలో చెప్పారు. అలాగే తులసిబాబుతో కలిసి సునీల్ కుమార్ నిధుల దుర్వినియోగం చేశారంటూ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని రఘురామ ఏసీబీ డీజీకి రాసిన లేఖలో తెలిపారు.
మరోవైపు సునీల్ కుమార్ మీద రఘురామ ఢిల్లీ స్థాయిలో కూడా ఫిర్యాదులు చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ మీద రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేశారు. పలు అంశాలలోనూ సునీల్ కుమార్ మీద ఆరోపణలు, అభియోగాలు చేశారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి వాస్తవాలు వెలుగు తీసేందుకు ఏపీ ప్రభుత్వం అథారిటీని ఏర్పాటు చేసింది.
ఈ అథారిటీలో ఆర్పీ సిసోడియా, హరీష్ కుమార్ గుప్తాలను నియమించింది. వీరు విచారణ చేసి.. నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఐపీఎస్ అధికారి మీద విచారణ అథారిటీని ఏర్పాటు చేయటం మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: Laila Teaser: ఒక్కోడికి చీరలు కట్టి పంపిస్తా.. దుమ్ము లేపుతున్న టీజర్
Also Read: Ceasefire: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్