AP GAS SYLINDERS: మహిళలకు బిగ్‌ అలర్ట్‌.. ఇలా చేయకపోతే ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ క్యాన్సిల్!

ఏపీ మహిళలకు బిగ్‌ అలర్ట్‌. ఇప్పటివరకు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకోని వారు మార్చి ఆఖరికల్లా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ సూచించింది. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని అధికారులు తెలిపారు. 

New Update
free gas cylinder scheme

AP government key announcement on free gas booking

AP GAS SYLINDERS: సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన దీపం-2 పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులను అలర్ట్‌ చేసింది. ఇప్పటివరకు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకోని వారు.. మార్చి ఆఖరికల్లా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని సూచించింది. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని పౌరసరఫరాల అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు గ్యాస్‌ బుక్‌ చేసుకోనివారికి ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ అని హెచ్చరించారు. 

రేషన్‌కార్డే ప్రామాణికం..

2024 అక్టోబర్‌ 31 నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. రేషన్‌కార్డే ప్రామాణికంగా దీపం- 2 పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు అక్టోబరు 29 నుంచే ఉచిత గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్ లభించింది. ఇక ఏప్రిల్‌ నుంచి రెండో సిలిండర్‌ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరిట కనెక్షన్‌ ఉందో వారి పేరు కచ్చితంగా రేషన్‌ కార్డులో ఉంటేనే రాయితీ వర్తిస్తుంది. 

Also read :  ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

ఈకేవైసీ తప్పనిసరి.. 

ఇక ఉచిత సిలిండర్‌ కోసం గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. అప్పుడే ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ పొందొచ్చు. ఈకేవైసీ చేసుకోకపోయినా, ప్రతినెలా రేషన్‌ తీసుకోకపోయినా, 300 యూనిట్లకుపైగా విద్యుత్తు వినియోగం, ప్రభుత్వ ఉద్యోగులు, కారు ఉన్నా ఈ దీపం పథకం వర్తించదు. దీపం-2 లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌ దగ్గరకు వెళ్లి గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు. లబ్ధిదారులు అధికారుల సూచనలను దృష్టిలో ఉంచుకుని వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోని ఫ్రీ గ్యాస్ ను మిస్ చేసుకోవద్దని సూచించారు. 

Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి!

లైగింక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.దీపక్‌ అనే వ్యక్తి వేధించడం వల్లే తాను చనిపోతున్నట్లు నాగాంజలి సూసైడ్‌ నోట్‌ రాసింది.

New Update
rjy

rjy

కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న ఫార్మాసిస్ట్.. శుక్రవారం తుది శ్వాస విడిచింది. నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వల్ల పార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, దుర్గారావులు కోరుతున్నారు.

Also Read: Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్..  !

అసలేం జరిగిందంటే...

కాగా.. గత నెల 23న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వికాస్‌ ఫార్మసీ కళాశాల ఫార్మ్‌ డి ఫైనలియర్‌ విద్యార్థిని నాగాంజలి (23) ఆత్మహత్యాయత్నం తీవ్ర సంచలనం రేపింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మం డలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నాగాంజలి రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి వద్ద వికాస్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్‌ డి పైనలియర్‌ చదువుతోంది. అయితే గత నెలలో నాగాంజలి ఆస్పత్రిలోనే ఎనస్థీషియా అత్యధిక డోస్‌ ఇంజక్షన్‌ తీసుకుంది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే గమనించిన సహచరులు ఐసీయూలోకి తరలించి చికిత్స అందజేశారు. ఈ క్రమంలో నాగాంజలి డైరీలో రాసుకున్న సూసైడ్ లెటర్ బయటకు రావడంతో తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థినిలు రాజమహేంద్రవరంలో ఆందోళనకు దిగారు.

Also Read: Gujarat: వారం క్రితమే నిశ్చితార్థం...ఇంతలోనే ప్రమాదం..కన్నీళ్లు పెట్టిస్తున్న గుజరాత్‌ జెట్‌ పైలెట్‌ మృతి!

ఆసుపత్రిలో మెడికల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న దీపక్‌ వేదింపుల వల్లే నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు సూసైడ్ నోట్‌లో రాసింది. అంతే కాకుండా సూసైడ్ నోట్‌లో దీపక్‌ వల్ల తాను అనుభవించిన బాధలను వివరించింది. ఓ ఫంక్షన్‌కు రెడ్ శారీ కట్టుకుని వెళ్లడంతో వాడి కళ్లలో పడ్డానని.. తనను మోసం చేశాడని, తనకు మరణం తప్ప వేరే దారి లేదని, తన గురించి బెంగపెట్టుకోవద్దని, తాను మరణించాక అవయవాలు దానం చేయాలి అంటూ ఫార్మాసిస్ట్ సూసైడ్‌ నోట్‌ రాసిమరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దీపక్‌ ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నాగాంజలి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!

Also Read:  Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

 student | suicide | rajamahendravaram | east-godavari | westgodavari | crime | ap | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment